»   » లవర్స్: దిల్ రాజును కడుపుబ్బా నవ్వించిన సమంత (ఫోటోలు)

లవర్స్: దిల్ రాజును కడుపుబ్బా నవ్వించిన సమంత (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటిస్తున్న చిత్రం 'లవర్స్'. మారుతి సమర్పణలో మాయాబజార్ మూవీస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ ఆడియో వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరైన ఆడియో ఆవిష్కరించారు. స్టార్ దర్శకుడు వివి వినాయక్ లోగో శిష్కరించగా, మరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ప్రముఖులు, చిత్ర యూనిట్ సమక్షంలో ఈ చిత్ర ఆడియో వేడుక సందడిగా సాగింది.

ఆడియో వేడుకలో సమంత సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. అందరితోనూ కలివిడిగా ఉంటూ....సందడి చేస్తూ హల్ చల్ చేసింది. దిల్ రాజు, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారిని తెగ నవ్వించింది. ఆది 'లవర్స్' ఆడియో వేడుకలా కాకుండా సమంత షో మాదిరిగా సాగింది.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు,ఆడియో వేడుకకు సంబంధించిన వివరాలు...

సమంత మాట్లాడుతూ...

సమంత మాట్లాడుతూ...

ఆడియో వేడుకలో సమంత మాట్లాడుతూ...లవ్ అనేది గొప్ప ఫీలింగ్. లవర్స్ సినిమా పెద్ద హిట్ట అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలను, టెక్నీషియన్స్‌ను సమంత ప్రశంసించారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ...

త్రివిక్రమ్ మాట్లాడుతూ...


దర్శకుడు త్రివిక్రమ్ చిత్ర యూనిట్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి తన ప్రసంగం ముగించారు.

వివి వినాయక్

వివి వినాయక్


జేబీ అందించిన సంగీతం విన్నాను. పాటలు బాగున్నాయి. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...


సినిమా యూత్ కి దగ్గరయ్యేదిగా ఉంది. సుమంత్, నందిత చక్కగా నటించారు. టీం మొత్తం ఎనర్జీగా పని చేసింది. అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

మారుతి మాట్లాడుతూ...

మారుతి మాట్లాడుతూ...


సినిమాకు స్క్రీన్ ప్లు, మాటలు అందించాను. స్టోరీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ..

హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ..


సినిమాకు పని చేసిన మారుతి గారికి థాంక్స్. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీసారు. టీం మొత్తం చాలాకష్టపడ్డారు. అందకు తగిన ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

నందిత మాట్లాడుతూ..

నందిత మాట్లాడుతూ..


సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అని తెలిపారు.

దర్శకుడు హరినాథ్ మాట్లాడుతూ...

దర్శకుడు హరినాథ్ మాట్లాడుతూ...


మారుతిగారికి ముందుగా థాంక్స్. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. టీం మొత్తం కష్టపడి పని చేసింది. అందరికీ ధన్యవాదాలు అన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..


మా బేనర్లో సుమంత్ ‘అంతకు ముందు ఆ తర్వాత' సినిమా చేసాడు. ఆ చిత్రం మంచి విజయం అందుకుంది. ఇపుడు లవర్స్ కూడా అదే రేంజిలో హిట్టవుతుందని అనుకుంటున్నాను అన్నారు.

ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో..

ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో..


ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో ఇంకా కె.ఎస్.రామారావు, ఎమ్మెస్రాజు, రాజీవ్ కనకాల, బెల్లంకొండ సురేష్, శ్రీమణి, కృష్ణ చైతన్య, నవదీప్, నాగ శౌర్య, సుదర్శన్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ హరి, అలంకార్ ప్రసాద్, గీతామాధురి, నందు, ఆదిత్యనిరంజన్, సప్తగిరి,సాయి,సురేష్ కొండేటి తదితరులు పాల్గన్నారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో నటీనటుల విషయానికొస్తే ఎమ్మెస్ నారాయణ, సప్తగిరి, సాయి, మున్నావేణు, తేజస్విని, షామిలి, చాందిని తదితరులు నటించారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి ఆర్ట్: ఇ.గోవింద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్, ఎడిటర్: ఎస్.బి.ఉద్దవ్, కెమెరామెన్: మల్హర్ భట్ జోషి, సంగీతం: జేబి, స్క్రీన్ ప్లే- మాటల: మారుతి

దర్శక నిర్మాతలు

దర్శక నిర్మాతలు


ఈ చిత్రానికి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్ర బాబు, కథ-దర్శకత్వం: హరినాథ్.

English summary
Sumanth Aswin, Nandita acted Lovers film audio release function held at Hyderabad on Thursday (4th July). Samantha relesed the audio CDs. Suryadevara Nagavamsi, B Mahendra Babu jointly producing the film under Maya Bazar films banner. Maruti presenting the film Harinath Director of the film, JB Composed the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu