»   » హౌ క్యూట్ : సమంతా నాగచైతన్య క్రిస్మస్ ట్రీ చూడండి

హౌ క్యూట్ : సమంతా నాగచైతన్య క్రిస్మస్ ట్రీ చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ సమంత ఇంట్లో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. త్వరలో క్రిస్మస్ పండుగ రానున్న నేపధ్యంలో తన ఇంటికి క్రిస్మస్ త్రీ తెచ్చుకున్నట్లు సమంత ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఏడాదిలో తనకు ఎంతో ఇష్టమైన సమయం ఇదే అని, తన చెట్టు తనకోచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పుడు దాన్ని అందంగా తయారు చేయాలనీ అంటూ సమంత ట్విట్ చేసింది.

అక్కినేని నాగ చైత‌న్య కూడా క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ చేసేసాడు. చైత‌న్య హిందువు క‌దా...మ‌రి చైత‌న్య ఇంట్లో క్రిస్మ‌స్ సంద‌డి ఏమిటి అనుకుంటున్నారా..? చైత‌న్య హిందువు అయిన‌ప్ప‌టికీ...స‌మంత క్రిస్టియ‌న్. అందుక‌నే ఇటు హిందు సంప్ర‌దాయం ప్ర‌కారం, అటు క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం గుడిలోను, చ‌ర్చిలోను పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

samantha and Naga chaitanya christmas celebrations

అయితే... గ‌తంలో చైత‌న్య‌, స‌మంత క‌లిసి పూజ చేస్తున్న ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో స‌మంత మ‌తం మార్చుకుంది అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌ను చైత‌న్య ఖండిస్తూ...స‌మంత మ‌తం మార్చుకోవ‌డం అలాంటిది ఏమీ లేదు. త‌నని ఇష్ట‌ప‌డిన‌ప్పుడు త‌న పూజించే ఏసు క్రీస్తును కూడా ఇష్ట‌ప‌డ‌తాను. నాకు దేవుడి విష‌యంలో అలాంటి ప‌ట్టింపులు లేవు అన్నాడు. నిజంగానే చైత‌న్య‌కు దేవుడి విష‌యంలో అలాంటి ప‌ట్టింపులు లేవు. దానికి నిద‌ర్శ‌న‌మే ఈ ఫోటో..!

ఇంట్లో కూర్చుని ఎంత బుద్ధిగా క్రిస్మస్ ట్రీ తయారు చేస్తోందో చూశారా? పక్కనే కాఫీ(?)గ్లాస్ పెట్టుకుని మరీ.. నీట్ గా క్రిస్మస్ ట్రీ సిద్ధం చేస్తోంది. అయితే పాపం సామ్స్ ఇలా కష్ట పడుతూంటే తాను మాత్రం ఊరికే ఎలా కూచుంటాడు. అందుకే తను కూడా సాయం చేయడం చేయడం మొదలు పెట్టాడు అక్కినేని నాగచైతన్య. సమంత ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీకి సంబంధించిన డెకరేషన్.. లైటింగ్ ఏర్పాట్లను చూసుకుంటున్నాడు. చైతు-శామ్ ల జంటగా ఏర్పాటు చేస్తున్న ఈ ట్రీ.. ఈసారి క్రిస్మస్ పండక్కి వీరికి చాలా స్పెషల్ అని చెప్పాల్సిందే.

English summary
Tollywood actors Naga Chaitanya and Samantha getting ready for Christmas. Take a look at their X-mas celebrations photos and images.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu