»   » సమంత, నాగచైతన్య పెళ్లికి ముహుర్తం పెట్టేశారు.. ఎప్పుడూ.. ఎక్కడంటే..

సమంత, నాగచైతన్య పెళ్లికి ముహుర్తం పెట్టేశారు.. ఎప్పుడూ.. ఎక్కడంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమమ్‌ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా మే 26న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం నాగచైతన్యకు ప్రత్యేకం. ఎందుకంటే అందాల తారతో నిశ్చితార్థం జరిగిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా. ఈ సినిమా గురించి, సమంతతో జీవితం, మ్యారేజ్ డేట్స్ లాంటి అంశాలను చైతూ ఇటీవల ప్రముఖ మీడియాతో పంచుకొన్నారు. నాగ చైతన్య ఏమన్నారంటే..

సమంతకు చాలా ఇష్టం

సమంతకు చాలా ఇష్టం

నాకు ఇష్టమైన పనుల్లో వంట ఒకటి. టైమ్ దొరికిందంటే సరదాగా వంటింట్లోకి దూరి ఇష్టమైనది చేసేస్తుంటా. సమంత నేను చేసిన వంటల్ని బాగా ఇష్టపడుతుంది. నేను చేసిన ఏ వంటకాన్నైనా ఇష్టంగా తింటుంది. బైక్‌లు, కార్‌లపై నాకున్న ఇంట్రస్ట్‌ను చూసి ఎంజాయ్ చేస్తుంది. నాతో పాటు రైడింగ్‌‌కు కూడా వస్తుంటుంది అని చైతూ వెల్లడించాడు.

ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా..

ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా..

ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా నాన్నను సర్.. సర్ అని పిలిచేది. ఇంకా సర్ అని పిలువడం ఎందుకు అని అడిగేవాడిని. నాన్న కూడా అదే విషయాన్ని అడిగితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజు నుంచి అలాగే పిలుస్తున్నా. అదే అలవాటైంది' అని చెప్పేది. కానీ ఈ మధ్యే వాళ్లు ‘మామా... కోడలా' అని పిలుచుకొంటున్నారు. వారి మధ్య ఉన్న రిలేషన్‌ను ఇటీవల నాన్న ట్విట్టర్‌ ద్వారా అందరితోనూ పంచుకొన్న సంగతి తెలిసిందే. అఖిల్‌, సమంతలు కూడా ఫ్రెండ్స్‌లా ఉంటారు అని నాగచైతన్య చెప్పారు.

ఆ విషయాలపైనే ఎక్కువగా చర్చించుకొంటాం..

ఆ విషయాలపైనే ఎక్కువగా చర్చించుకొంటాం..

లైఫ్, వెకేషన్ లాంటి అంశాలపై మా మధ్య చర్చ జరుగుతుంది. ఏడేళ్లుగా మేము ఫ్రెండ్స్. ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసు. ఇప్పుడు నా స్నేహితులు, తన స్నేహితులు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఎక్కడికైనా వెళ్లినా అందరం కలిసే వెళుతుంటాం. వేడుకలు కూడా కలిసే జరుపుకొంటుంటాం. కెరీర్‌పరంగా ఒకరికొకరు సలహాలు, సూచలనలు ఇచ్చుకొంటాం. నా సినిమాల గురించి ఆమెను నేను చెప్తా. ఆ చేసే చిత్రాల గురించి తనూ చెప్తుంది అని చైతూ చెప్పారు.

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం..

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం..

పెళ్లి చేసుకోవడంపై ఇక ఆలస్యం చేసుకోదలచుకోలేదు. సమంతతో కలిసి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాను. అక్టోబర్‌లో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి వేదిక ఇంకా ఖరారు కాలేదు. మేమిద్దరం రెండుసార్లు పెళ్లిచేసుకొంటాం. హిందూ సంప్రదాయం ప్రకారం ఒకసారి, క్రైస్తవ మత ఆచారాల ప్రకారం మరోసారి పెళ్లి చేసుకొంటాం అని ఆయన అన్నారు.

English summary
Naga Chaitanya Akkineni's latest movie is Rarandoy Veduka Chuddam. This movie is getting ready to release on May 26. In this occassion he s spoke to media and shares about movie and personal life. Chaitu said that they were getting marriage in october month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu