»   » సమంతా మూగమ్మాయి కాదు.... సీక్రేట్ రివీల్ చేసారు

సమంతా మూగమ్మాయి కాదు.... సీక్రేట్ రివీల్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమై 10 రోజులు అయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ కాగా.. ఇప్పటికే ఓ పాట షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. సమంత షూటింగ్ లో పాల్గొన్న ఒకట్రెండు రోజులకే ఈ సినిమాపై కొత్త రూమర్ వచ్చేసింది.

ఒక రూమర్ ని బయటికి వదిలారు

ఒక రూమర్ ని బయటికి వదిలారు

రామ్‌చరణ్‌ చెవులు వినిపించని ఓ యువకుడిగా తెరపై కనిపిస్తారని చెప్పిన దగ్గరినుండీ హీరోయిన్ ఎలా ఉందబోతుందన్న ఊహల్లో పడిపోయారంతా.ఇక సమంతా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందీ అనగానే తమ ఊహా శక్తికి మరింత పదును పదును పెట్టేసారు. అలా ఒక రూమర్ ని బయటికి వదిలారు... అదీ కాస్త "నమ్మబుల్" గా నే ఉంది మరి.

సిరివెన్నెల

సిరివెన్నెల

సినిమాలో సమంత మాట్లాడలేని ఓ అమ్మాయిగా కనిపించబోతోందని వినికిడి లోపమున్న హీరో, మాట్లాడ లేని హీరోయిన్ల మధ్య ప్రేమ ఒక నాటి క్లాసిక్ సినిమా సిరివెన్నెల లాంటి మరో అద్బుతమైన ప్రేమ కథ అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఒక్క సారిగా అందరి దృష్టీ సుక్కూ సినిమా వైపు మళ్ళింది.

ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్న రూమర్లు

ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్న రూమర్లు

అయితే ఇలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్న రూమర్లు సినిమాకి చెడు చేస్తాయని అనిపించటం తో అలాంటిదేమీ లేదని చెప్పేసారు సినిమా యూనిట్... మూవీలో సమంత ఎలాంటి లోపం ఉన్న పాత్ర చేయడం లేదట. ఈమె పోషిస్తున్న పాత్ర ఓ రిచ్ విలేజ్ గాళ్ అని చెబుతున్నారు.

మూగ రోల్

మూగ రోల్

మూగ రోల్ అంటూ వస్తున్న వార్తలను ఖండించేశారు. గ్రామీణ నేపథ్యంతో సాగే పక్కా కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు యూనిట్.చెర్రీ మూవీలో సమంత రోల్ చాలా ఆకట్టుకునేలా ఉంటుందని.. ఇంతగా పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉండే రోల్ చేసే అవకాశం కెరీర్ లో ఒక్కసారి మాత్రమే వస్తుందని.. అంతటి ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని అని చెప్పేసారు.

పెద్ద విజయమే అయినా

పెద్ద విజయమే అయినా

అంతే కదా కొన్ని రూమర్లు సినిమా మీద అంచనాలను పెంచే వరకే అయితే పర్లేదు గానీ..., ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెంచితే మొదటికే మోసం మరి... మొత్తానికి సుక్కూ ఆర్ట్ సినిమా టైపు కాకుండా మంచి కమర్షియల్ సినిమానే తీస్తున్నాడన్న మాట. ధృవ పెద్ద విజయమే అయినా అనుకున్నంత సక్సెస్ కాలేదన్న చెర్రీ వర్రీ ఈ సినిమా తోనైనా తీరుతుందేమో చూడాలి

English summary
One such recent update was that heroine Samantha is playing a dumb girl role in Ram Charan movie.But the latest update reveals that Sam's role will be perfectly alright without any disabilities.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu