»   » అక్కినేని వారి కాబోయే కోడలు సమంత....పెళ్లి తర్వాత ప్లాన్ ఇదే!

అక్కినేని వారి కాబోయే కోడలు సమంత....పెళ్లి తర్వాత ప్లాన్ ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత త్వరలో అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మరి పెళ్లి తర్వాత సమంత జీవితం ఎలా ఉండబోతోంది? సినిమాల్లో నటిస్తుందా? లేక పిల్లలను కనేసి అమల లాగా హౌస్ వైఫ్ గా సెటిలవుతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

ఇటీవల ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన అంశాల సమంత కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చింది. పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా డిజైన్ చేసుకుంటాననే వివరాలు వెల్లడించారు. ఈ విషయాలతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

అయితే తాను ప్రేమిస్తున్న చెలికాడు (నాగ చైతన్య) పేరుగానీ, తాను కోడలుగా వెళ్లబోయే కుటుంబం (అక్కినేని ఫ్యామిలీ) గురించి ప్రస్తావించకుండా సమంత తన ఇంటర్వ్యూ కొనసాగించడం విశేషం. ఈ విషయాలను ప్రస్తావిస్తే మీడియా వారు తనపై మరిన్ని ప్రశ్నలు సంధిస్తారనే కారణంతో సమంత తెలివిగా వ్యవహరించారు.

మంచి కుటుంబం కావాలి. మంచి పిల్లలు కావాలి

మంచి కుటుంబం కావాలి. మంచి పిల్లలు కావాలి

పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ..... నేను ఏడాది కాలం నుంచి ప్రేమలో ఉన్నానని ఇప్పటికే చెప్పాను. అందువల్ల ప్రియుడెవరూ? పెళ్లి ఎప్పుడూ? అన్న ప్రశ్నలు ఇక అడగకండి. నాకు మంచి కుటుంబం కావాలి. మంచి పిల్లలు కావాలి. మా వివాహ తేదీని సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతాను అన్నారు.

పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పను

పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పను

ఇటీవల సినిమాలు కాస్త తగ్గించిన మాట నిజమే. కావాలనే విరామం తీసుకున్నాను. వంటలు నేర్చుకోవడానికి, ఇతర పనులు నేర్చుకోవడానికి ఆ సమయం కేటాయించాను. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తాను. నేను కోడలుగా వెళ్లబయే కుటుంబ గౌరవానికి ఎలాంటి అప్రతిష్ఠ కలుగకుండా సినిమాలను ఎంచుకుంటాను అన్నారు.

నాగ్ పరిచయం చేసారు

నాగ్ పరిచయం చేసారు

ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి వేడుకకు నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్నేహితులకు సమంత తనకు కాబోయే కోడలు అంటూ పరిచయం చేసారటన నాగార్జున.

కాబోయే అత్తగారితో...

కాబోయే అత్తగారితో...

కాబోయే అత్తగారు అమలకు సమంత చాలా క్లోజ్ అవుతోంది. ఇటీవల వారు అన్నపూర్ణ స్టూడియెలో కలిసి ఇలా చాలా విషయాల గురించి ముచ్చటించారు. తనకు కాబోయే కోడలికి చాలా సూచనలు చేసిందట అమల.

నాగ చైతన్య, సమంత

నాగ చైతన్య, సమంత

ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి వేడుకకు నాగ చైతన్య, సమంత కలిసి జంటగా రావడంతో వీరి పెళ్లి విషయంలో అపీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చినట్లయింది. పెళ్లి వేడుకలో ఈ జంటను చూసిన వారంతా చూడముచ్చటైన జంట అంటూ చర్చించుకున్నారు.

కాబోయే మరిదితో కలిసి సరదాగా...

కాబోయే మరిదితో కలిసి సరదాగా...

అఖిల్, సమంత మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. నాగ చైతన్యతో ప్రేమలో పడ్డ తర్వాత సమంతకు చాలా విషయాల్లో హెల్ప్ చేసాడట అఖిల్.

నిశ్చితార్థం డేట్ ప్రకటించిన నాగ్

నిశ్చితార్థం డేట్ ప్రకటించిన నాగ్

డిసెంబర్ 9న అఖిల్ ఎంగేజ్మెంట్ జరుగుతుందని నాగార్జున స్వయంగా వెల్లడించారు. వివాహం 2017లో ఉంటుందన్నారు. శ్రీయ భూపాల్ అనే అమ్మాయితో అఖిల్ వివాహం జరుగబోతోంది. చైతన్య ఎప్పుడు ఓకే చెబితా తాను అప్పుడు పెళ్లి జరిపించడానికి సిద్ధమని నాగార్జున తెలిపారు.

English summary
Samantha opens up about marriage plans and after marriage career plans. Samantha Ruth Prabhu to marry Naga Chaitanya next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu