»   » యస్ , చైతన్య తో డేటింగ్ లో ఉన్నా ,అలాగే... : సమంత

యస్ , చైతన్య తో డేటింగ్ లో ఉన్నా ,అలాగే... : సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అనే విషయం అఫీషియల్ గానే నాగార్జున ప్రకటించిన తెలిసిందే . నాగ్ కుమారుడు నాగచైతన్య, గ్లామరస్ హీరోయిన్ సమంత లవ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. అయితే సమంత ఈ విషయమై పెదవి విప్పలేదు. చెప్పీ చెప్పినట్లుగా గుంభనంగా ఉంటూ వచ్చింది.

ఇంతకాలం చైతన్య తో తనకున్న రిలేషన్ షిప్ ని గుర్తు చేైసేలా...ఫోటోలు పెట్టటమో.. కామెంట్ చేయటం లాంటివి చేసినా.. ఓపెన్ గా ఏ మీడియా సంస్థకు తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడింది లేదు. అయితే ఇక పెద్దల దగ్గరనుంచి అంగీకారం రాగానే ఆమె ఉషారుగా మీడియాతో తన లవ్ ఎఫైర్ బయిటపెట్టింది.
ఈ మధ్యనే చైతూ లవ్ మ్యాటర్ పై నాగార్జున మాట్లాడుతూ...పిల్లల ఇష్టానికి మించింది తనకేమీ ఉండదని చెప్పటం జరిగింది.

Samantha opens up about Naga Chaitanya and marriage

తాజాగా సమంత.. ఒక ప్రముఖ మీడియా సంస్థతో సమంత ప్రత్యేకంగా మాట్లాడుతూ.... తన లవ్ మ్యాటర్ ను అఫీషియల్ గా చెప్పేసింది. అంతేకాకుండా.. ఆమె.. తాను చైతన్యతో రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పేసింది. తాము ఇప్పుడు డేటింగ్ లో ఉన్నామన్న సమంత.. పెళ్లి మాత్రం ఈ ఏడాదిలో జరగదని చెప్పింది.

మరి.. పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు.. పెళ్లి ఎప్పుడైనా దాని డేట్ రివీల్ అయ్యేది మాత్రం మూడు నెలల ముందేనని.. అది తమ సంప్రదాయంగా చెప్పుకొచ్చారు. అలాగే నావకు లంగరు రిలేషన్ ఎలాంటిదో తన జీవితంలో చైతన్య పాత్ర కూడా అంతేనని అంది.

ఇక ఎప్పటిలాగే అందరినీ అడిగినట్లుగా... పెళ్లి తర్వాత సినిమాల మాటేమిటంటే.. తన కెరీర్ ను చైతన్య ప్రోత్సహించే వ్యక్తి అని.. ప్రేక్షకులు ఇక చాలు అనేంతవరకూ సినిమాలు చేసేస్తానని చెప్పింది.

    English summary
    Samantha Said... Chay (Naga Chaitanya) and I are in a relationship and the reason we're not talking about marriage is because even the immediate family would know about the wedding only three months before. Why should I talk about marriage to the media when there's still time?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu