For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్య సరసన మరోసారి సమంత...వివరాలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : సమంత మరోసారి నాగ చైతన్య సరసన చేయటానికి కమిటైంది. ఇష్క్ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేని మూడుతరాలు నటించే సినిమాలో ఆమెను తీసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ఖరారు చేసారు. ఆయన మాట్లాడుతూ.... . 2013 మార్చిలో విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుంది. ఇందులో నాన్న, నేను, నాగచైతన్య కలిసి నటించబోతున్నాం. కథ బాగా నచ్చింది. నాగచైతన్య సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. నా పక్కన నటించేది ఎవరో ఇంకా ఖరారు కాలేదు అన్నారు. ఇప్పటికే నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో ఏమి మాయ చేసావే,ఆటోనగర్ సూర్య చిత్రాలు రూపొందాయి.

  ఇక ప్రస్తుతం నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో 'ఆటోనగర్ సూర్య' తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి నాగార్జున చెబుతూ... 'ఆటోనగర్ సూర్య' బాగా వస్తోంది. కొన్ని సీన్లు, రెండు పాటలు చూశా. చాలా నచ్చాయి. డైరెక్టర్ దేవా కట్టా మీద నాకు మంచి నమ్మకం. చక్కని కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నాడు అన్నారు. దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'. ఈచిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విడుదల మరో నెల ముందుకు వెళ్లిపోయింది. డిసెంబర్ 2 వ తేదీన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు దేవకట్టా ట్విట్టర్ లో తెలియచేసారు.

  ఈ చిత్రంలో నాగచైతన్య స్కిల్ డ్ మెకానిక్ గా కనిపించనున్నారు. నాగాచైతన్య పాత్ర గురించి వివరిస్తూ... "చైతూ ఈ చిత్రంలో స్కిలెడ్ మెకానిక్ గా కనిపించనున్నారు. పూర్తిగా హీరో సెంట్రిక్ స్క్రిప్టు ఇది. ప్రస్దానం కన్నా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అన్నారు. ఇక దేవకట్టాకు డైలాగ్స్ విషయంలో మంచి గ్రిప్ ఉందని గతంలో ప్రస్దానం నిరూపించింది. ఆ చిత్రంలో లోతైన భావమున్న డైలాగులుకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రకు మొదట ఆడియో టీజర్ విడుదల చేసి మరీ క్రేజ్ క్రియేట్ చేసారు" అన్నారు.

  ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

  English summary
  Samantha might team up with Naga Chaitanya for the third time, if all goes well. The duo had already worked together in Ye Maya Chesave and Autonagar Surya. The latest buzz is that she has been approached to play one of the lead roles in Vikram Kumar’s upcoming film titled Thrayam. The film stars three actors from Akkineni family and stars ANR, Nagarjuna and Naga Chaitanya in lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X