»   » సమంతకు సూపర్ లక్కీ, అరుదైన ఛాన్స్, స్టార్ హీరోలంతా గెస్ట్ లు

సమంతకు సూపర్ లక్కీ, అరుదైన ఛాన్స్, స్టార్ హీరోలంతా గెస్ట్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాకు తెలుగు పరిశ్రమ నుంచి సరైన ఆఫర్స్ రావడం లేదు..అంటూ రీసెంట్ గా సమంత మీడియా దగ్గర వాపోయింది. అంతేకాకుండా... నాగ్ కోడలిని కానుండడంతో.. ఆఫర్స్ రావడం లేదని చెప్పింది. కానీ అటు సమంత మాటలకు విరుద్దంగా, ఓ సూపర్ ఆఫర్..అందులోనూ ఫెరఫార్మెన్స్ కు అవకాసం ఉన్న ఓ రోల్ సమంత దగ్గరకు చేరిందని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహానటి సావిత్రిగా సమంత నటించబోతున్నారు. దశాబ్దాల పాటు వెండితెరపై వెలిగిన సావిత్రి బయోపిక్ ని ..అశ్వనీదత్ అల్లుడు...యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
'ఎవడే సుబ్రమణ్యం'తో విజయాన్ని అందుకొన్న నాగ్‌ అశ్విన్‌ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. సుదీర్ఘకాలం సావిత్రి స్క్రిప్టుపైనే కసరత్తులు చేసిన ఆయన త్వరలోనే సినిమాని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు. సావిత్రి పాత్ర కోసం కొందరు హీరోయిన్స్ పేర్లు పరిశీలించినప్పటికీ ఆ అవకాశం సమంతని వరించింది.

Samantha to play the role of Savitri!

'జనతా గ్యారేజ్‌' తర్వాత సమంత మంచి కథల కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఇప్పుడు 'సావిత్రి'లో నటించడానికి అంగీకరించింది. సావిత్రి వృత్తిగత జీవితంలో ప్రముఖ నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల పాత్రలు కీలకం. వారి పాత్రల్లో స్టార్ హీరోలు నటిస్తారని ప్రచారం సాగుతోంది.

అయితే.. సావిత్రి పాత్రను చేయాల్సిందిగా సమంత అడిగేందుకు నాగ్ అశ్విన్ ఆమెను కలిశాడని ప్రచారం జరుగుతోంది కానీ...అయితే అఫీషియల్ ప్రకటన లేదు. మీడియాలో కొందరు మాత్రం ...సమంత పాత్ర కోసం కాక వేరే మరేదైనా పాత్ర కోసం అడిగారని చెప్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ లేదని అంటున్నాడు.

    English summary
    Samantha have excited by the narration of director Nag Ashwin. Nag Ashwin has been planning to do a biopic of Mahanati Savitri, the great yesteryears actress.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu