»   » ముగ్గురు హీరోయిన్లను బుక్ చేసిన త్రివిక్రమ్!

ముగ్గురు హీరోయిన్లను బుక్ చేసిన త్రివిక్రమ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కథకు సరిపడే హీరోలను, హీరోయిన్లను ఎంచుకోవడం పూర్తిగా దర్శకుల చాయిసే. ఇక త్రివిక్రమ్ లాంటి అగ్రదర్శకులు....తమ సినిమాలకు పర్ ఫెక్ట్ చాయిస్ ఎంచుకుంటారు. తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.

తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి త్రివిక్రమ్ ముగ్గురు హీరోయిన్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం 'అత్తారింటికి దారేది'కి పని చేసిన సమంత, ప్రణీతలను తాజా సినిమాలోనూ రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. వీరిద్దరితో పాటు '1-నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్రితి సానన్‌ను కూడా ఎంపిక చేసాడు. కథ పరంగా ఈచిత్రానికి ముగ్గురు హీరోయిన్లు అవసరం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాడట.

గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో 'జులాయి' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజా దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

జులాయి చిత్రం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సమంత

సమంత

సమంత అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న తొలి సినిమా. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

ప్రణీత

ప్రణీత

హీరోయిన్ ప్రణీతకు మరో మంచి ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు అత్తారింటికి దారేదిలో నటించిన ప్రణీతకు కెరీర్ పరంగా కలిసొచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మళ్లీ చేస్తుండటం ఆమెకు కలిసొస్తుందని అంటున్నారు.

క్రితి సానన్

క్రితి సానన్

హీరోయిన్ క్రితి సానన్ మహేష్ బాబుతో లొలి అవకాశం దక్కించుకున్నా సినిమా ఆడక పోవడంతో ఫలితం లేక పోయింది. మరి ఈ సినిమాతోనైనా అమ్మడి దశ తిరుగుతుందో చూడాలి.

English summary
Trivikram is directing Allu Arjun again in an upcoming film and the movie was launched. The latest buzz from the film nagar is that this untitled project will have three ladies Samantha and Praneetha, Kriti Sanon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu