For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రికి రాత్రే రేటు పెంచేసిన మహేష్ హీరోయిన్...!?

By Sindhu
|

కేవలం మూడే మూడు చిత్రాలతో తెలుగులో అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది సమంత. ఇప్పుడంతా ఈ భామని లక్కీగాళ్ అంటున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి అందులో జెస్సీగా కనిపించి కుర్రకారుని తన మాయలో పడేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన 'బృందావనం"లో నాజూకు అందాలతో ఆకట్టుకుంది. ఈ రెండు విజయాలతో మహేష్ సరసన 'దూకుడు" చిత్రంలో నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసింది సమంత.

ఈ చిత్రంతో వరుసగా మూడో విజయాన్ని దక్కించుకున్న ఈ భామ తన పారితోషికాన్ని కోటికి పెంచేసి కోటి రూపాయల పారితోషికం అందుకునే భామల లిస్ట్‌ లో చేరిపోయిందని తెలుస్తోంది. 'దూకుడు" చిత్రానికి ముందు దాదాపుగా యాభై లక్షలు మాత్రమే పారితోషికాన్ని స్వీకరించిన సమంత 'దూకుడు" విజయంతో పారితోషికం విషయంలో తన దూకుడు చూపించనుందట. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ", గౌతమ్‌మీనన్ రూపొందిస్తున్న త్రిభాషా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు త్వరలో శ్రీనువైట్ల-జూ ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌ లో సెట్స్‌ పైకి వెళ్ళనున్న చిత్రంలోనూ, అలాగే బొమ్మరిల్లు భాస్కర్-అల్లు అర్జున్‌ ల కాంబినేషన్‌ లో రూపొందనున్న చిత్రంలోనూ సమంత నటించనుందని తెలుస్తోంది.

అయితే 'దూకుడు" విజయంతో పారితోషికాన్ని అమాంతం పెంచడానికి కారణమేంటని సమంతని అడిగితే 'డిమాండ్ వున్నప్పుడే కదా మనం ఏమైనా డిమాండ్ చేయగలం. ప్రస్తుతం నాకున్న డిమాండ్‌ ని దృష్టిలో పెట్టుకుని పారితోషికంపై ప్రత్యేక దృష్టి పెట్టాను" అంటోంది సమంత.

English summary
Top heroes are making enquiries regarding her call sheets and producers are ready to shell out any money to rope her in. Her remuneration doubled overnight and she has entered the 1 crore club with Dookudu turning out to be a grand hit. Rajamouli and Gautham Menon should be lucky for signing her in their films before Dookudu happened.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more