»   » నేను కూడా షుగర్‌తో బాధపడ్డా : సమంత (ఇంటర్వూ)

నేను కూడా షుగర్‌తో బాధపడ్డా : సమంత (ఇంటర్వూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అది చాలా సహజం. అంతెందుకు... నేను కూడా కొన్నాళ్ల క్రితం లో షుగర్‌తో బాధపడ్డాను. అయినా హీరోయిన్‌ ఎప్పుడూ అందంగా, అంతా పర్‌ఫెక్ట్‌గా కనిపించాలని లేదు కదా? అందుకే త్రివిక్రమ్‌ నా పాత్ర గురించి చెప్పగానే.. మరో మాట లేకుండా ఓకే చెప్పేశాను. స్వతహాగా ఆ పాత్రను నేను బాగా ఆస్వాదించా అంటోంది సమంత.సమంత... ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయమంతా నిండిపోయింది. అందంతోనూ ఆకట్టుకుంటోంది. అభినయంలోనూ తిరుగులేదని నిరూపించింది. వాటన్నిటికంటే నాలో అదృష్టం కూడా ఎక్కువే అంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే... సినిమాలో నేను డయాబెటిక్‌ అనేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు. రెండేళ్ల క్రితం నాకు నిజంగానే సుగర్‌ లెవల్స్‌ తక్కువ స్థాయిలో ఉన్నాయి. కొంతమంది ‘‘మీరెందుకు డయాబెటీస్‌గా చేశారు? ఆ కేరక్టర్‌ ఎందుకు ఒప్పుకున్నారు?'' అని అదేదో చాలా పెద్ద విషయమన్నట్లు అడిగారు. కానీ సినిమాలో ఆ పాత్రను చాలా లైటర్‌వీన్‌లో చూపించారు. ఇవాళ యువతలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో డయాబెటిస్‌ కూడా ఒక సాధారణ విషయం. అందుకే నా సీన్లను ప్రేక్షకులు ఆస్వాదించారు. నేనూ ఆ పాత్ర చేసేప్పుడు బాగా ఆస్వాదించాను. ఇప్పటిదాకా నేను ఇంతటి ఫన్నీ కేరక్టర్‌ చెయ్యలేదు అని చెప్పారామె.


‘సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన సమీరగా సమంత హీరోయిన్ పాత్రను పోషించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో మీడియా వారితో సంభాషించారు సమంత.


ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ సినిమా కోసం ఫైటింగులు చేస్తూ బిజీగా గడుపుతోంది. నేపాల్‌లో జరిగిన ఓ యాక్షన్‌ ఘట్టంలో గాయం కావడంతో సమంత చేయి బాగా కందిపోయింది. ఆ గాయంతోనే మీడియా ముందుకొచ్చింది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' గురించీ, తన సినీ ప్రయాణం గురించీ సమంత ఇలా చెప్పుకొచ్చింది.


స్లైడ్ షోలో... సమంత లేటెస్ట్ ఫొటోలు...ఇంటర్వూ


నా ఛాయిస్ డైరక్టరే

నా ఛాయిస్ డైరక్టరే

'సన్నాఫ్‌ సత్యమూర్తి' చేయడానికి కారణం దర్శకుడే. అయినా ఎప్పుడూ నా ప్రాధాన్యం దర్శకుడికే. ఆ తర్వాతే కథ గురించి ఆలోచిస్తా. పైగా త్రివిక్రమ్‌గారికి నేను పెద్ద అభిమానిని. 'అత్తారింటికి దారేది' తర్వాత ఆయనతో మరో సినిమా చేయాలనుకొన్నా. వ్యక్తిగతంగా నాకు కుటుంబ కథా చిత్రాలంటే ఇష్టం. మొదట్నుంచీ అలాంటి చిత్రాల్లోనే నటిస్తూ వచ్చా. త్రివిక్రమ్‌గారు ఈ కథ గురించి చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశా.


షాక్‌కి గురయ్యా

షాక్‌కి గురయ్యా

నిజం చెప్పాలంటే... తొలిరోజు సినిమాకి లభిస్తున్న స్పందన షాక్‌కి గురయ్యా. సినిమా చూసి బయటికొచ్చాక... ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొద్దిమంది బాగుందంటే... మరి కొద్దిమంది బాగోలేదంటున్నారు. నాకేం అర్థం కాలేదు. చాలా నిరాశకు గురయ్యా.


పరిస్ధితి మారింది

పరిస్ధితి మారింది

రెండోరోజు వచ్చేసరికి పరిస్థితి మారింది. మూడో రోజు అందరూ బాగుందనడం మొదలుపెట్టారు. వసూళ్లు కూడా చాలా బాగొస్తున్నాయి. విదేశాల్లో మిలియన్‌ డాలర్‌ వసూళ్ల మార్క్‌ని కూడా దాటింది. ఆ మార్క్‌ని దాటిన నా ఆరో చిత్రమిది. ఆ విషయం ఎంతో సంతృప్తినిస్తోంది.


ప్రేక్షకుల కోసమే..

ప్రేక్షకుల కోసమే..

సినిమాలో హీరోయిన్ గా నేనొక్కదాన్నే కనిపించాలని నాకూ ఉంది. కానీ ప్రేక్షకులకు అలా నచ్చడం లేదు కదా. మాకు తెరపై ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే అంటున్నారు (నవ్వుతూ).


ఆశ్చర్యపోయా

ఆశ్చర్యపోయా

సినిమాలో నాతో కలిసి నటించిన నిత్య మేనన్‌, ఆదా శర్మ ప్రతిభావంతులు. నిత్య అంటే నాకు ఎంతో గౌరవం. సెట్‌లో ఆదాశర్మ నటనని చూసి ఆశ్చర్యపోయా. తెలుగు చాలా బాగా మాట్లాడింది. తనకి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకొంటున్నా.


అల్లు అర్జున్‌తో బాగా నచ్చిన విషయం

అల్లు అర్జున్‌తో బాగా నచ్చిన విషయం

క్రమశిక్షణ గల నటుడు బన్నీ. తనని చూశాక... నాకు పని మీద ప్రేమ లేదేమో అనిపించింది. మామూలుగా సెట్‌లో నాకు డైలాగ్‌ ఉందంటేనే... సన్నివేశంపై దృష్టిపెడుతుంటా. లేదంటే నాలోకంలో నేనుంటా. కానీ బన్నీ మాత్రం తన డైలాగ్‌ ఉన్నా లేకపోయినా... సన్నివేశంపైనే దృష్టి పెడుతుంటారు. తనలో నాకు బాగా నచ్చిన విషయం అదే.


పని అమ్మాయిలాగ కనిపిస్తానేమోనని

పని అమ్మాయిలాగ కనిపిస్తానేమోనని

బన్నీ స్త్టెలిష్‌ స్టార్‌. తను ధరించే దుస్తులు చాలా స్త్టెలిష్‌గా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే నా కాస్ట్యూమ్స్‌ ఉండాలని ముందే అనుకొన్నా. లేదంటే... ఆయన పక్కన ఒక పనిమనిషిలాగా కనిపిస్తానేమో అని భయపడ్డా.


తమిళ చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి

తమిళ చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి

చేస్తున్నది తెలుగులోనా, తమిళంలోనా అన్నది ముఖ్యం కాదు. నేను హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టి ఐదేళ్లు పూర్తయింది. ఇంకా నేను అలా వచ్చి, ఇలా కనిపించి వెళ్లిపోయే పాత్రలు చేస్తే బాగుండదు కదా. అందుకే మంచి కథ, ప్రాధాన్యమున్న పాత్ర అనిపిస్తేనే ఒప్పుకొంటున్నా. లేదంటే చేయనని చెప్పేస్తున్నా.


ఒప్పుకుంటున్నా

ఒప్పుకుంటున్నా

నిజంగానే 'మనం' తర్వాత నేను చెప్పుకోదగ్గ సినిమా చేయలేదు. ఆ విషయాన్ని నేనూ ఒప్పుకొంటున్నా.


ఆ లోటు తీరుతుంది

ఆ లోటు తీరుతుంది

అయితే ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌తో కలిసి చేస్తున్న చిత్రం ఆ లోటుని తీర్చేలా ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన చిత్రాలు ఒకెత్తు, ఈ చిత్రం మరో ఎత్తు. ఇందులో పాత్ర కోసం చాలా కష్టపడుతున్నా. నాకు యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉంటాయి. అది తెలుగులో కూడా విడుదలవుతుంది.


నా అదృష్టమే...

నా అదృష్టమే...

నాకు నేనుగా రాసుకొన్నా... ఇంత గొప్పగా ఉండదు. నాకంటే అందమైన వాళ్లు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. నాలాగే కష్టపడేవాళ్లూ ఉన్నారు. కానీ నేను ఈ స్థాయికి చేరుకొన్నానంటే కారణం నా అదృష్టం అని నమ్ముతుంటా. ఇంతకంటే ఎక్కువ ఇంకేమీ కోరుకోను.


అలాంటి తప్పు చేయను

అలాంటి తప్పు చేయను

అలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయను (నవ్వుతూ). తప్పు అని ఎందుకంటానంటే... రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదు అంటారు కదా. అలా ఒక కాలు ఒకచోట, ఇంకో కాలు మరో చోట పెట్టడం నాకు ఇష్టం లేదు.


లవ్ ఎఫైర్ అంటున్నారు..

లవ్ ఎఫైర్ అంటున్నారు..

ఆ వ్యాపారవేత్త ఎవరో చెప్పేయండి, అబ్బాయిని వెదుక్కొనే బాధ తీరిపోతుంది (నవ్వుతూ). ప్రేమ వద్దు, పెళ్లి వద్దు (నవ్వుతూ). ప్రస్తుతానికి ఆ విషయాల గురించి ఏమీ ఆలోచించడం లేదు.


ట్విట్టర్‌లో వ్యాఖ్యలలపై చర్చ జరుగుతుంటుంది...

ట్విట్టర్‌లో వ్యాఖ్యలలపై చర్చ జరుగుతుంటుంది...

ఎవరేం మాట్లాడుకొన్నా... నా అభిప్రాయాల్ని మాత్రం దాచుకోను. నా మనసులో ఏదుంటే అది బయట పెడుతుంటా. పరిశ్రమలో అందరితోనూ నాకు మంచి అనుబంధముంది. నేనేంటో అందరికీ తెలుసు.


పెళ్లెప్పుడు?

పెళ్లెప్పుడు?

ఇప్పుడు ఈ లవ్వూ, పెళ్లీ.. ఇవన్నీ వద్దండి. కొన్ని సంవత్సరాల దాకా వదిలెయ్యండి. ఇప్పుడు నన్నిలా పని చేసుకోని వ్వండి.లక్ కలిసొచ్చింది అంతే

లక్ కలిసొచ్చింది అంతే

పోయిన సంవత్సరం నేను నటించిన ‘మనం', ‘కత్తి' (తమిళం) మినహా మిగతా సినిమాలు కాస్త అటూ ఇటూ అయ్యాయి. ఈ ఐదేళ్ల కెరీర్‌ను తలుచుకుంటే నాకు చాలా ‘లక్‌' కలిసివచ్చిందనిపిస్తుంది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి' అమెరికాలో ఒక మిలియన్‌ డాలర్లను వసూలు చేసిన నా ఆరో సినిమాగా నిలిచింది. ప్రతి హీరోయినూ శ్రమిస్తుంది. అందంగా ఉంటుంది. వాటితో పాటు ఇంకేదో కావాలి. అదే ‘లక్‌'. ఆ లక్‌ విషయంలో దేవునికి నాపై దయ ఉందని అనిపిస్తోంది.


ఫ్లాఫ్ అయితే బాధే

ఫ్లాఫ్ అయితే బాధే

ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు బాధగానే ఉంటుంది. ‘ఇది పెద్ద హిట్టవుతుంది' అని నమ్మే ఏ సినిమాకైనా సంతకం చేస్తాం. మీడియానీ, క్రిటిక్స్‌నీ, అంచనాలనీ అందుకోవడం డిఫికల్ట్‌. ఒక్క సినిమా ఫ్లాపయితే, దాని ముందు వచ్చిన పెద్ద హిట్‌ను జనం మర్చిపోతారు. ఇది సహజమే. కాబట్టి హిట్‌ వచ్చినప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో నాకు తెలుసు.


నిత్యామీనన్ గురించి

నిత్యామీనన్ గురించి

నిత్య అందరికీ తెలుసు. దక్షిణ భారతంలోని అత్యంత ప్రతిభావంతులైన తారల్లో తను కూడా ఒకరు.


అదా శర్మ గురించి

అదా శర్మ గురించి

ఆమెతో మొదటి సీన్‌ చేసేప్పుడు ఆమె నటన చూసి షాకయ్యా. చాలా బాగా చేసింది. ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయికి మంచి రోల్స్‌ రావాలని నేను ఆశిస్తున్నా.


త్రివిక్రమ్‌తో రెండోసారి పనిచేయడంపై..

త్రివిక్రమ్‌తో రెండోసారి పనిచేయడంపై..

త్రివిక్రమ్‌గారి సినిమా చేయడంతో నా కెరీర్‌ను ముగించేయవచ్చు. ఆయనతో పనిచెయ్యడమే గొప్ప అనుభవం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని గౌరవంగా, అదృష్టంగా భావిస్తాను. ఆయనతో కలిసి పనిచెయ్యడం, మాట్లాడటం సులువు. ఆయనతో రెండు సినిమాల కోసం రెండేళ్లు ప్రయాణం చేశాను. ఆయనలో డైరెక్టర్‌ని మించి స్నేహితుణ్ణీ, గురువునూ చూస్తాను. నాకేదైనా సమస్య వస్తే ఆయనకు ఫోన్‌ చేస్తాను. ఆయన జడ్జ్‌మెంట్‌ను గౌరవిస్తాను. దేవుడి నుంచి ఎలాంటి జవాబును ఆశిస్తారో, త్రివిక్రమ్‌ కూడా అలా జవాబిస్తారు.


English summary
Samantha revealed that she too had faced diabetic complications at one point of her life, just like the character in the film which suffers from diabetes. The actress even thanked director Trivikram for handling her character quite well. On the other hand, Samantha's revelation made everyone wonder at the actress health which was under scrutiny couple of years ago.
Please Wait while comments are loading...