»   » సమంతా కర్రసాము... చూస్తే అవాక్కవ్వాల్సిందే (వీడియో)

సమంతా కర్రసాము... చూస్తే అవాక్కవ్వాల్సిందే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంతా 'కర్ర సాము' నేర్చుకుంటోంది. అందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది. అక్కినేని ఇంట కోడ‌లిగా అడుగు పెడుతోన్న చెన్నై చిన్న‌ది స‌మంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. రకరకాల విన్యాసాలు, మంచి మెసేజ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌మంత వ‌చ్చే ఆగ‌స్టు క‌ల్లా ఫ్రీ అయిపోనుంది.

గిర..గిరా కర్ర తిప్పుతూ

గిర..గిరా కర్ర తిప్పుతూ

ప్రస్తుతం సమంతా తెలుగు .. తమిళ సినిమాలను వరుసగా చేస్తోంది. అందువలన ఏ సినిమా కోసం సమంతా కర్రసాము నేర్చుకుంటుందో తెలియదుగానీ, గట్టి శిక్షణనే తీసుకుంటోంది. మరి ఆమె ఏ సినిమాలో కర్రసాముతో అదరగొడుతుందో చూడాలి. తాజాగా మరో వీడియోనూ పోస్ట్ చేసింది సామ్ బేబి. గిర..గిరా కర్ర తిప్పుతూ కర్ర సాము చేసింది సమంత. ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తిలా ఆమె చేసి కర్రసామును చూస్తే కాస్తంత షాకవ్వాల్సిందే. ఆ వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సమంత..

ఛాలెంజెస్‌ అంటే ఇష్టమట

ఛాలెంజెస్‌ అంటే ఇష్టమట

సమంతకి ఛాలెంజెస్‌ అంటే ఇష్టమట. అలా, కర్రసాము నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం సమంత తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇది కాస్త పాతకాలం నాటి నేటివిటీతో కూడిన సినిమా. రామ్‌చరణ్‌ పల్లెటూరి యువకుడిలా కన్పిస్తాడు. అంటే, ఇందులో సమంత కర్రసాము చేసే అవకాశాలున్నాయేమో.!

రాజు గారి గది 2

రాజు గారి గది 2

‘రాజు గారి గది 2'లో ఓ దెయ్యం పాత్రలో సమంత దర్శనమివ్వనుందన్న సమాచారం ఇప్పటికే ఆమె అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతుండగా, మరో వైపు ‘సావిత్రి' బయోపిక్ లో ఓ కీలక పాత్రలో సమంత మెరవనుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కర్ర తిప్పుతూ పోస్ట్ చేసిన వీడియో వీక్షకులను అవాక్కు చేస్తోంది.

ఒక నిముషం పాటు

ఒక నిముషం పాటు

దాదాపుగా ఒక నిముషం పాటు అద్భుతంగా కర్ర తిప్పిన ఈ వీడియోకు నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు. ఏ సినిమా కోసం సమంత ఈ విద్య నేర్చుకుందో గానీ, హీరోలను మించిపోయే రేంజ్ లో సమంత కనపడుతోంది. గతం లోనూ జిమ్ లో భారీ వర్క్ ఔట్లతో పెట్టిన వీడియోలూ ఉన్నాయి.

నాకు సవాళ్లంటే చాలా ఇష్టం

ఓ మెసేజ్‌నూ పెట్టేసింది. ‘‘నాకు సవాళ్లంటే చాలా ఇష్టం.. అందుకే!'' అంటూ మెసేజ్ పెట్టేసిన సమంత.. వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు సమంత కర్ర సాము వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. ఏమైనా నటనతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న సామ్ బేబి.. ఇలా కర్ర సాముతో తనలో దాగి ఉన్న విద్యలను బయటి ప్రపంచానికి చాటి చెబుతోందన్న మాట. సమంత కర్రను గిర..గిరా ఎలా తిప్పేసిందో చూడండి మరి!!

    English summary
    "Because I like a challenge. New hobby. Silambam. Can't wait to get better at this," Samantha tweeted.She also shared a video in which she is seen practicing Silambam, like a professional.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu