»   » సమంత ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుందీ... కారణం పెళ్ళేనా??

సమంత ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుందీ... కారణం పెళ్ళేనా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాజల్ హవా తగ్గింది. ఇలియానా..,త్రిష లాంటి వాళ్ళు వెనకబడి చాలా కాలమే అయ్యింది.. ఇక అనుష్క.., నయన తార స్టార్ హీరోయిన్ లే అయినా ఇప్పటికిప్పుడు నంబర్ వన్ అనే దశలో అయితే లేరు. ఇక ఇప్పుడు టాప్ నంబర్ వన్ హీరోయిన్ ఎవరూ అంటే వినిపించే పేరు సమంత.. ఆ పొజిషన్ లో ఉన్న ఎవరైనా ఏం చేస్తారు? ఆ స్థానాన్ని కాపాడుకోవాలనుకుంటారు.., పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే మరిన్ని అవకాశాలని అందుకోవటానికి ప్రయత్నిస్తారు... కానీ సమంతా మాత్రం వింత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చేస్తున్న జనతా గ్యారేజ్ తప్ప సమంతా ఇప్పటి దాకా ఇంకో సినిమా కి సైన్ చేయలేదు..ఇకముందు చేయదట కూడా

నటిగా స్ట్రాంగ్ పొజీషన్ లో ఉన్న సమంత సడెన్ గా సినిమా చేయననే నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుందా అని సినీ ఫీల్డ్ లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు. సమంత పూర్తిగా సినిమాలు మానేస్తుందా? లేక గ్యాప్ తీసుకుంటుందా... అన్నది కూడా తెలీడం లేదు.

Samantha Ruth Prabhu to take a break from acting?

అయితే సమంతానిర్ణయానికి వెనక కారణాన్నీ ఊహిస్తున్నారు కొందరు. నాగ చైతన్యతో ప్రేమలో ఉందంటూ వచ్చిన వార్థల నేపథ్యం లో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే చైతూ...సామ్ వెంటనే మ్యారేజ్ చేసుకుంటారని, కాబట్టి పెళ్లి విషయంలో ఏ ఆటంకాలు రాకుండా ఉందటానికి సమంత ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. పైగా పెళ్లి తర్వాత తను గ్లామర్ రోల్స్ వేయనని, ట్రెడిషనల్ గా మాత్రమే చేస్తానని సమంత ఆ మధ్య చెప్పింది కూడా.

ఇంతకు ముందు కూడా ఒకసారి తన జీవితం లో కుటుంబసభ్యులనీ.., స్నేహితులనీ కలిసే సమయం కూడా లేకపోవటం తో సినిమాలు మానేయాలనుంది అంటూ చెప్పిన సమంతా..ఆ కారణం తో కూడా యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటుందా అన్నదికూడా కొందరి అనుమానం

అక్కినేని ఫ్యామిలీలో రెండు పెళ్లిళ్లు జరిగే సూచనలు కనబడుతున్నాయి. అఖిల్ పెళ్లికి కూడా కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు తెలుస్తోంది కనుక...చైతూ, సమంత పెళ్లికి కూడా ఒప్పుకోవచ్చనే అంటున్నారు. ఇక తాను సినిమాలు ఒప్పుకోక పోవటానికి పెళ్ళి విశయమే అంటున్నారు కొందరు. ఒక వేళ అదే అయితే సమంతా తీసుకున్న నిర్ణయం తెలివయ్యిందే అనుకోవాలి...

    English summary
    Samantha is currently doing only one film, Janatha Garage with Jr NTR, and that will finish by July end. After this, the actress wants to be completely free and thus hasn’t signed anything.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu