»   » ‘1-నేనొక్కడినే' పై సమంత చేసిన వివాదం ట్వీటు ఏమిటి?

‘1-నేనొక్కడినే' పై సమంత చేసిన వివాదం ట్వీటు ఏమిటి?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: '1-నేనొక్కడినే' పోస్టర్‌పై సమంత పరోక్ష విమర్శ చేస్తూ తన ట్విట్టర్లో కామెంట్ చేయడం మహేష్ బాబు అభిమానులకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ ఫ్యాన్స్...సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్ అంటూ వారిపై ట్వీట్ల వర్షం కురిపించారు. సమంత కామెంట్లను సపోర్టు చేసిన హీరో సిద్ధార్థపై కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరిద్దరూ ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేసారు. ఇంతకీ అసలు సమంత చేసిన ట్వీట్ ఏమిటీ...

  సమంత ట్వీట్ చేస్తూ... ''విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్‌ ఈ మధ్య చూశాను. ఆ పోస్టర్‌లో హీరో,హీరోయిన్స్ ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది''- ఇదీ సమంత చేసిన ట్వీటు. ఇది ఏ సినిమా పోస్టర్‌ గురించి అనేది మాత్రం ఆమె రాయలేదు.

  Samantha's Controversy With A Tweet On '1' Poster

  కానీ ఇటీవల విడుదల చేసిన మహేష్ కొత్త చిత్రం '1-నేనొక్కడినే' పోస్టర్‌ గురించే అని సామాజిక అనుసంధాన వేదికల్లో దుమారం రేగుతోంది. సమంత ఎందుకిలా మాట్లాడింది... దీనికి సమాధానం ఎవరు చెప్తారు అనేది మాత్రం వేచిచూడాల్సిందే. అయితే సమంత చేసిన ఈ ట్వీటు ఆ హీరో, సమంత అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. సమంత ను సపోర్ట్ చేస్తూ కొందరు...మహేష్ సినిమాను సపోర్ట్ చేస్తూ మరికొందరు ట్వీట్స్ చేసుకుంటున్నారు.

  ఈ విషయమై సిద్దార్ధ ట్వీట్ ఇదీ... "Agree or disagree all you want. The moment you question anyone's right to an opinion, well that just makes you a bully, a terrorist even,"

  '1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

  14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

  English summary
  
 Samantha's tweet said 'Saw a poster of a yet to be released Telugu film. Not only is it deeply regressive, but it's point is actually that it is deeply regressive' Mahesh Babu's '1-Nenokkadine' poster has the heroine crawling behind the hero and he looking at her dismissingly.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more