»   » సమంత ఇప్పుడు ఏం పుస్తకం చదువుతోందో తెలుసా? ఆశ్చర్యమే

సమంత ఇప్పుడు ఏం పుస్తకం చదువుతోందో తెలుసా? ఆశ్చర్యమే

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే సమంత..కాస్తంత ఖాళీ దొరికితే మాత్రం పుస్తకాల్లో కూరుకుపోతుంది. తాజాగా ఆమె ఏం పుస్తకం చదువుతోందో తన అభిమానుల కోసం ట్విట్టర్ లో షేర్ చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు.

  అంతేకాదు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అయిన పుస్తకం చదివాక ఆమె తన అభిప్రాయాన్ని సైతం షేర్ చేసింది. మీరూ పుస్తకం చదవండి. అంతటి ద్వేషంలో మనం ప్రేమను నింపేందుకు ప్రయత్నిద్దాం అనే అర్దం వచ్చేలా రాసుకొచ్చింది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ స్ప్రెడ్ చేసే ద్వేషంలో ప్రేమని నింపమని మనకి సలహా ఇస్తోందన్నమాట.

  కెరీర్ విషయానికి వస్తే..త్వరలోనే సమంత..జనతాగ్యారేజ్ సాంగ్ షూటింగ్ లో పాల్గొననుంది. ఇటీవల 24, అ..ఆ.. లాంటి సూపర్ హిట్స్ అందుకున్న సమంత ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈసినిమా తరువాత సమంత ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు.

  జనత గ్యారేజ్ షూటింగ్ కూడా పూర్తి కావస్తుండటంతో సమంత.., సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదన్న చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా బిజీ షెడ్యూల్స్ తో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న జెస్సీ, కుటుంబానికి సమయం కేటాయించేందుకే సినిమాలు అంగీకరించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

  Samantha's current read: Rise of ISIS

  మరో ప్రక్క ...సమంత...టాలీవుడ్ దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్లో ఒకరు కానున్నారన్న విషయం కొంతకాలంగా సంచలన వార్తగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. యువ నటుడు నాగచైతన్యతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా సమంత ఒక పత్రికకు ఇచ్చిన ఇంటరర్వ్యూలో తన అనుభవాలను ఈ విధంగా వ్యక్తం చేశారు.

  సమంత మాట్లాడుతూ.. ''జీవితంలో నాకు అన్నీ పెద్దగా కష్టపడకుండా సులభంగానే లభించాయి. చిన్న వయసులో ప్రతి దినం కొత్తగా ఉండాలని కోరుకునేదాన్ని. నటిని అయిన తరువాత అలాగే జరుగుతోంది. నిత్యం సరి కొత్తగా జీవిస్తున్నాను. నటిగా మొదట్లో సాధారణంగానే ఉన్నా ఆ తరువాత మారిపోయాను.

  నా ప్రయాణాన్ని ఇప్పుడు తిరిగి చూస్తే నా జీవితం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదో మాయ జరిగిందని అని భావిస్తాను. సినీరంగ ప్రవేశం చేసి ఆరేళ్లు అయ్యింది. కొంతకాలం ముందు వర్ధమాన నటిని. ఇప్పుడు సీనియర్ నటినయ్యాను. దీంతో నాకు బాధ్యతలు అధికమయ్యాయి.

  ఇంతకు ముందు మాదిరి వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించలేను. మంచి కథాంశం ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయించుకున్నాను'' అని అంటున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత నటిస్తారా? లేదా?అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు.

   English summary
   Currently taking a break from all the shoots, Samantha is busy reading the book, New York times best seller "Rise Of ISIS", written by Jay Sekulow and shared the same with her fans on micro-blogging site. "Read. All we can do is try to love in the face of such hate . And for those who can do something about this. Tic toc", she tweeted.
    

   తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more