»   » నా సూపర్‌స్టార్ బ్రదర్... అంటూ సమంత ట్వీట్

నా సూపర్‌స్టార్ బ్రదర్... అంటూ సమంత ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ సమంత త్వరలో నాగ చైతన్యను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ద్వారా దగ్గుబాటి కుటుంబానికి సమంత బంధువు కాబోతోంది. వరుస పరంగా చూస్తే హీరో రానా సమంతకు అన్నయ్య అవుతాడు.

ఈ నేపథ్యంలో సమంత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ఆగస్టు 11న విడుదలవుతున్న నేపథ్యంలో సమంత "ఊ..హూ... నా సూపర్ స్టార్ అన్నయ్య రానా చిత్రం. ఆగస్టు 11న ఫస్ట్ డే ఫస్ట్ షో" అని ట్వీట్ చేసింది.

సురేశ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. డా.డి.రామానాయుడు సమర్పిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. డి. సురేశ్‌బాబు, ఎం.వి.కిరణ్‌ రెడ్డి, సి. భరత్‌ చౌదరి నిర్మాతలు. వివేక్‌ కూచిభొట్ల, అభిరామ్‌ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు. కాజల్‌ అగర్వాల్‌, కేథరిన్‌ ట్రెసా నాయికలు. నవదీప్‌ కీలక పాత్రధారి. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 'జోగేంద్ర యువగర్జన' కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించగా మంచి స్పందన వచ్చింది.

English summary
Heroine Samantha has shared a photograph of Rana's cut out in a white shirt and white lungi avatar. While posting the photograph she tweeted that "Woo hoo .. and that's my superstar brother RanaDaggubati #nenerajunenemantri #FDFS #August11." We all know that Sam is quite active in social media. This is the first time that Sam has posted something about Rana. This has grabbed the attention of netizens.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more