»   » చీరకట్టులో మతిపోగొడుతూ సమంత(ఫొటోలు)

చీరకట్టులో మతిపోగొడుతూ సమంత(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సమంత..గత కొంతకాలంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు ప్రమోషన్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటో షూట్ కోసం ఆమె ప్రత్యేకమైన చీరకట్టులో కనిపించి అలరించి. ఈ ఫోటోలు చూసిన వారు స్టన్ అవుతున్నారు. పాపులర్ ఫొటో గ్రాఫర్ జి వెంకట్రామ్...ఈ ఫొటోలను ప్రింట్ యాడ్స్ కోసం తీసుకున్నారు. మీరు ఇక్కడా ఆ ఫొటోలు చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక సమంత ఈ సంవత్సరం కూడా యాడ్ లతో పూర్తి బిజీగా ఉండేటట్లు కనపడుతోంది. కొత్త కమిట్ మెంట్స్ తో ఆమె బిజీగా ఉంది. ఈ సంవత్సరం కొన్ని కమిట్ మెంట్ కు సంభందించి మీకు అనౌన్స్ మెంట్ ఇవ్వాలి. మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాను...అంటూ ట్వీట్ చేసి మరీ అనౌన్సమెంట్ ఇచ్చేసింది.

https://www.facebook.com/TeluguFilmibeat

ప్రముఖ ఆభరణాల తయారీదారు జ్యూయల్ వన్ కు ఆమె ఎండార్సమెంట్ జరిగిందని, షూటింగ్ జరిగిందని చెప్పింది. ఓ ప్రక్క సినిమా షూటింగ్ లు మరో ప్రక్క ఇలా యాడ్స్ తో ఆమె ఫుల్ బిజీగా ఉంది. అలాగే హీరోయిన్ సమంత కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సమంత దాన్ని పది రోజులు పాటు కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

అలాగే.. సమంత తమిళనాడుకు చెందిన భామ అయినప్పటికీ....తెలుగులోనే తొలుత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యే అంజాన్, కత్తి చిత్రాల ద్వారా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు చిత్రాలకు పెద్దగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయని సమంత...ఇపుడు మాత్రం ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తుందట.

https://www.facebook.com/TeluguFilmibeat

ఇదే విషయమై సమంతను వివరణ అడిగితే తనదైన రీతిలో సమాధానం ఇస్తోంది. ‘ఒకప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా హీరోల పెర్ఫార్మెన్స్ చూడటానికే వచ్చే వారు. కానీ ఇప్పటి రోజుల్లో హీరోయిన్ల ప్రాధాన్యత కూడా పెరిగింది. ముఖ్యంగా యువతరం హీరోయిన్ల గ్లామర్ షో చూడటానికి థియేటర్లకు వస్తున్నారు. హీరోలతో సమానంగా మాకూ ప్రాధాన్యత పెరిగింది. అలాంటపుడు మేము ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంలో తప్పేముంది' అని ప్రశ్నిస్తోంది.

‘పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ఉంటే మేము ఇంతగా డిమాండ్ చేయం. తక్కువ తీసుకోవడానికే ట్రై చేస్తాం. లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేసినా అంతే. అలాంటి పాత్రలు చేసినపుడు మంచి పాత్రలు చేసామనే సంతృప్తి ఉంటుంది. ఫుల్ కమర్షియల్ పాత్రలు చేసినపుడు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాం' అని తెగేసి చెప్పింది సమంత.

సమంత సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది.

    English summary
    Photos of Brand promotion for “South India Shopping Mall”, heroine Samantha killed it yet again. She is just stunning in the new photo shoot done for the latest print ads of the brand by popular photographer G Venkat Ram.
    Please Wait while comments are loading...