twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంతతో పెళ్లయిందేమో? సొంత అన్నయ్యే కామాంధుడు.. చిన్మయి చెప్పిన సంచలన నిజాలు!

    |

    #మీటూ ఉద్యమంలో ధైర్యంగా పాల్గొంటూ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మాత్రమే కాదు... తనలాగా వేధింపులకు గురై, బయటకు చెప్పుకోలేని వారికి అండగా నిలుస్తున్నారు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. తాజాగా చిన్మయి తమ్మారెడ్డి భరద్వాజతో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు... మీటూ ఇష్యూ గురించి ముచ్చటించారు. దీంతో పాటు సమంతతో తన పరిచయం, రాహుల్‌తో పెళ్లి లాంటి ఆసక్తికర అంశాలపై సైతం మనసు విప్పి మాట్లాడారు.

    సమంతకు నాకు ఎప్పుడో పెళ్లయిపోయిందనుకుంటా...

    సమంతకు నాకు ఎప్పుడో పెళ్లయిపోయిందనుకుంటా...

    సమంతకు నాకు ఎప్పుడో పెళ్లయిపోయిందనుకుంటా? అంటూ చిన్మయి సరదా వ్యాఖ్యలు చేశారు. మరి చైతు పిజిషన్ ఏంటి? అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించగా... చైతు పొజిషన్, రాహుల్ పొజిషన్ సేమ్ పొజిషనే. మాకు కనెక్షన్ విచిత్రంగా కుదిరింది. రాహుల్, సమంత ఇద్దరూ వారి తొలి ప్రాజెక్టుకు కలిసి పని చేశారు. తెలుగులో నా తొలి స్ట్రైట్ చిత్రం సమంత నటించిన ‘ఏమాయ చేశావె'. మాకు ఏదో పూర్వ జన్మ కనెక్షన్ ఉండి ఉంటుంది... అని చిన్మయి చెప్పుకొచ్చారు.

    పాపం రాహుల్ కర్మ నన్ను పెళ్లి చేసుకున్నాడు.

    పాపం రాహుల్ కర్మ నన్ను పెళ్లి చేసుకున్నాడు.

    పాపం రాహుల్ కర్మ నన్ను పెళ్లి చేసుకున్నాడు. అందాల రాక్షసిలో నేను లావణ్యకు డబ్బింగ్ చెప్పాను. ఆ సమయంలో పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుదామని అతడు అడిగితే మొదట నేను వద్దన్నాను. ‘వర్ణ' డబ్బింగ్ కోసం రామోజీఫిల్మ్ సిటీకి వచ్చాను. తిరిగి చెన్నై వెళుతుంటే ఒకే ఫ్లైట్లో కలిశాం. ఆ సమయంలో తన మనసులోని మాటను మరోసారి చెప్పాడు. నేను వెళ్లి మా అమ్మకు చెప్పాను. అలా సెట్టయి పెళ్లి చేసుకున్నామని చిన్మయి చెప్పుకొచ్చారు.

    ఉమెన్ ఎందుకు షేమ్ ఫీలవ్వాలి?

    ఉమెన్ ఎందుకు షేమ్ ఫీలవ్వాలి?

    మీటూ ఉద్యమంలో తనకు జరిగిన విషయాలను చెప్పడంతో పాటు ఇతరుల తరుపున బాధ్యత తీసుకుని వారికి ఎదురైన లైంగిక వేధింపుల గురించి కూడా చిన్మయి బయట పెడుతున్నారు. దీనిపై మాట్లాడుతూ... చాలా మంది ఉమెన్ ఇలాంటి విషయాలు బయటకు చెప్పడాన్ని సిగ్గుమాలిన చర్యగా పరిగణిస్తారు. తప్పు చేస్తుంది వేరెవరో... వాటిని బయట పెట్టిన ఉమెన్ ఎందుకు షేమ్ ఫీల్ అవ్వాలని చిన్మయి ప్రశ్నించారు.

    మహిళలకు ఒకే...కానీ బాయ్స్

    మహిళలకు ఒకే...కానీ బాయ్స్

    ఉమెన్‌కు కాస్త ఫర్వాలేదు... నాకు అలాంటివి ఏమైనా ఎదురైతే వెళ్లి మా అమ్మకు చెబుతాను, లేదా బెస్ట్ ఫ్రెండుకు చెబుతాను. మెన్ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. చాలా మంది మెన్ వారి మీటూ స్టోరీలు నాతో పంచుకున్నారు. చాలా మంది చిన్న పిల్లలుగా ఉన్నపుడు వారి సొంత అంకుల్స్, గ్రాండ్ ఫాదర్స్ చేతుల్లో రేప్‌కు గురవుతున్నారు. ఫ్యామిలీలో ఒక ట్రస్ట్, రెస్పెక్ట్ ఉన్న ఒక పెద్ద మనిషి ఇలాంటి బిహేవియర్ ఉంటే పిల్లలు సేఫ్‌గా ఎలా పెరుగుతారు.

     సొంత అన్నయ్యే సెక్యువల్ అబ్యూస్ చేశాడు

    సొంత అన్నయ్యే సెక్యువల్ అబ్యూస్ చేశాడు

    నా వద్దకు వచ్చిన ఓ స్టోరీ షాక్‌కు గురి చేసింది. ఒక లేడీ తారగ ఈ విషయం చెప్పింది... చిన్నప్పుడు వాళ్ల అన్న ఆమెను సెక్సువల్ అబ్యూస్ చేసేవాడు. ఫ్యామలీలో ఇటీవల అంతా కలిసినపుడు కోపంలో అతడి గురించి బయట పెట్టిందట. ఆ తర్వాత అతడి గురించి ఫ్యామిలీ మెంబర్స్ ఆరా తీస్తే అతడు తన చైల్డ్ ను కూడా సెక్సువల్ గా హరాస్ చేస్తున్నట్లు బయట పడింది. ఆ పాపకు 7 సంవత్సరాలు. ఆ డిస్క్రషన్ రాలేదంటే ఆ పిల్ల కూడా బలయ్యేది. మీటూ వల్లే ఇది సాధ్యమైంది అని చిన్మయి అన్నారు.

     ఇండియన్ కల్చర్ పేరుతో ఈ దారుణాలపై మాట్లాడటం లేదు

    ఇండియన్ కల్చర్ పేరుతో ఈ దారుణాలపై మాట్లాడటం లేదు

    చెన్నైలో చెవిటి మూగ అమ్మాయిని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో 18 మంది రేప్ చేశారు. స్కూలు బస్ వారు అపార్టుమెంట్ ఎంట్రన్సులో వదిలేసి వెళతారు. అక్కడ వాచ్ మెన్ నుంచి మొదలు పెట్టి ప్లంబర్ ఇలా చాలా మంది కొన్ని నెలల పాటు రోజూ రేప్ చేశారు. ఓసారి ఊరు నుంచి వచ్చిన వాళ్ల సిస్టర్ డ్రెస్ మారుస్తుంటే ఒంటిపై కొరికిన గాయాలు చూసి ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ అని చెప్పి ఒక పెద్ద సోషల్ సమస్యను డిస్క్రస్ చేయకుండా అడ్డుకుంటున్నాం. ఇందులో మార్పు రావాలని కోరుకుంటున్నాను. అందుకే ఇదంతా చేస్తున్నాను.

    వైరముత్తు ఇష్యూలో రాధా రవి వెటకారం

    వైరముత్తు ఇష్యూలో రాధా రవి వెటకారం

    14 ఏళ్ల క్రితం వైరముత్తు చేసింది ఇప్పటి వరకు గుర్తుందా? అంటూ రాధారవి గారు నాతో ఎటకారంగా మాట్లాడారు. అంటే నచ్చిందేమో? అన్నట్లు ఒక ఎగతాళి అతడి మాటల్లో కనిపించింది.. నాకు 7 ఇయర్స్ లో జరిగింది, ఆ తర్వాత జరిగింది గుర్తుంది. పబ్లిక్ లో, బస్సులో, స్కూల్ లో ఇది నార్మల్ గా జరుగుతుంది ఎందుకు దీని గురించి మాట్లాడటం అని కొందరు అంటున్నారు. కానీ ఇది నార్మల్ కాదు.

    ఆమెను చదువు మాన్పించారు

    ఆమెను చదువు మాన్పించారు

    ఇటీవల ఓ సంఘటనలో ఒక అమ్మాయికి అబ్బాయి నుంచి ఈవ్ టీజింగ్ ఎదురైతే వెళ్లి వాళ్ల అన్నయ్యకు చెప్పింది. అన్నయ్య వెళ్లి ఆ అబ్బాయిని కొట్టాడు. ఆ తర్వాత అమ్మాయి ఎడ్యుకేషన్ ఆపేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో పెడితే అమ్మాయిలకు సేఫ్టీ ఉందా? ఎందుకు అమ్మాయిల కళలను చిదిమేయాలి, తప్పు తనది కాదు, ఎవరిదో.... కానీ బలయ్యేది మాత్రం ఆడపిల్లలే.

    వైరముత్తు హగ్‌లో తప్పుడు ఉద్దేశ్యం

    వైరముత్తు హగ్‌లో తప్పుడు ఉద్దేశ్యం

    2006లో నాకు వైరముత్తు నుంచి తప్పుడు ప్రవర్తన ఎదురైంది. అప్పుడు ఏ పేపర్ సైన్ చేశానో, ఎందుకు సైన్ చేశానో గుర్తు లేదు దాని కోసం రమ్మంటే వెళ్లాను. సైన్ చేసిన తర్వాత ఆయన హగ్ చేసుకుని, నుదుటిపై కిస్ చేశారు. మనకంటే పెద్దవారు మనల్ని ఒక తండ్రి లాగా హగ్ చేసుకోవడాన్ని నేను తప్పబట్టడం లేదు. కానీ మనకు తెలుస్తుంది వారి హగ్‌లో బ్యాడ్ టచ్ ఉంటే... వైరముత్తు హగ్‌లో తప్పుడు ఉద్దేశ్యం నాకు అప్పుడే అర్థమంది. ఒక అమ్మాయితీ జీతే రహో బేటా అని నుదుటిపై ముద్దు పెట్టి ఆశ్వీర్వాదం ఇవ్వడం నాకు తెలుసు. ఎందుకంటే నేను బాంబేలో పెరిగాను. అయితే అందులో తప్పుడు ఉద్దేశ్యం ఉంటే మనకు వెంటనే అర్థమవుతుంది.

    7 ఏళ్ల వయసులోనే

    7 ఏళ్ల వయసులోనే

    నేను ఏడేళ్ల వయసులో ఉన్నపుడు ఒక మ్యాన్ నాతో తప్పుగా ప్రవర్తించాడు. మా అమ్మ ఒక రికార్డింగ్ స్టూడియోలో డాక్యుమెంటరీ ప్రిపరేషన్లో ఉంటే నేను నిద్ర పోయాను. ఆ వ్యక్తి నా అండర్ గార్మెంటులో చేయి పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే నేను మా అమ్మతో బ్యాడ్ అంకుల్ అని చెప్పాను. పిల్లలకు చిన్న తనం నుంచే బ్యాడ్ టచ్ ఏదో... గుడ్ టచ్ ఏదో నేర్పించాల్సిన అవసరం ఉంది అని చిన్మయి అభిప్రాయ పడ్డారు.

    గ్రాండ్ ఫాదర్ వల్లే ప్రెగ్నెంట్ అయింది

    గ్రాండ్ ఫాదర్ వల్లే ప్రెగ్నెంట్ అయింది

    మరో సంఘటనలో ఒక అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతే గ్రాండ్ ఫాదర్ వద్ద ఉంటోంది. కానీ ఆ తాతే ఆమెపై రేప్ చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీనిపై పంచాయితీ పెట్టారు, కోర్టుకు వెళ్లారు.... ఆమెకు ఎవరూ లేక పోవడంతో ఆమె చివరకు గ్రాండ్ ఫాదర్ వద్దకే చేరింది. ఇలాంటి సంఘటనల్లో సొల్యూషన్ చూపించాల్సిన అవసరం కూడా ఉంది అని చిన్మయి అభిప్రాయ పడ్డారు.

    English summary
    Samantha and Singer Chinmayi are Married? Tollywood Singer #ChinmayiSripaada reveals a few interesting facts about Samantha, Naga Chaitanya & Rahul Ravindran. She also shares her personal life, tragedy moments which she faced in her life and opens up about the dark side of the South Indian Film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X