»   »  ఎన్టీఆర్‌ లవకుశ : ఫ్యాన్స్ కోసం ఒక బిగ్ సర్ప్రైజ్

ఎన్టీఆర్‌ లవకుశ : ఫ్యాన్స్ కోసం ఒక బిగ్ సర్ప్రైజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో లో సినిమా ప్రారంభం అయిన తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రలు పోషించనుండగా.. ఇంకా ఈ మూడుపాత్రలతోనూ జతకట్టే ముగ్గురు హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచేసినట్లు మూడు వారాల క్రితమే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు..

జై లవకుశ అనే వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న ఈ సినిమాలో.. ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను దాదాపుగా ఖాయం చేశారు అన్న సమాచారం అయితే ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని కూడా ప్రకటిస్తారని భావించారు కానీ.. అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్.నెగెటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ తో కేమియో చేయించబోతున్నారట. అంతే తప్ప ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ మాత్రం సినిమాలో ఉండదని అంటున్నారు. ఇద్దరు హీరోలూ ఒక విల క్యారెక్టర్లు కావటంతో ఈ విలన్ పాత్రకి హీరోయిన్ లేదన్నమాట.

Samantha Special Role in Jai Lava Kusa?

కాగా, ఇప్పటికే ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా సెలెక్ట్‌ అయ్యారు. అయితే ఈ సినిమాలో క్యామియో చేయనున్న ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో కాదు.. ఇప్పటికే ఎన్టీయార్‌తో నాలుగు సినిమాలు చేసిన సమంత. జస్ట్‌ ఓ ఐదు నిమిషాల పాటు కనబడే సర్‌ప్రైజింగ్‌ అప్పీరియెన్స్‌ ఇవ్వనుందట సమంత. సమంత ప్రస్తుతం నాగార్జునతో చేస్తున్న 'రాజుగారి గది-2'తోపాటు సుకుమార్‌, చరణ్‌ కాంబినేషన్‌లో కూడా నటిస్తోంది.

English summary
Top actress Samantha, who romanced NTR Jr in his biggest hit 'Janatha Garage' and three other earlier movies, is reportedly being considered to share screen space with him again in the actor's new film 'Jai Lava Kusa'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu