సమంతకు ఫుడ్ పాయిజన్ జరిగింది
హైదరాబాద్ : తనకు ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా కష్టాలు ఎదురయ్యాయని, వరస్ట్ డే అని సమంత వాపోతోంది. తనకు ఫుడ్ పాయిజన్ కావటంతో అనారోగ్యానికి గురి అయ్యాయని చెప్తూ ట్వీట్ చేసింది. దాంతో ఆందోళన చెందిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పోస్ట్ లు కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే ట్రాన్సిట్ లో తన బ్యాగ్ ను పొగొట్టుకున్నాను అని వెల్లడించింది. అనారోగ్యం, ఫ్లయిట్ ఆలస్యం కావడంతో తాను అంజాన్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమంత తెలిపింది.

ఇదిలా ఉంటే...ఆమె అంజాన్ ఆడియో ఫంక్షన్ కి వెళ్లకుండా ఎగ్గొట్టడానికి వేసిన ఎత్తుగా కొందరు సినిమావాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. మీడియాలో కూడా ఫుడ్ పాయిజన్ లేదు మరేమీ లేదు...ఆమెకు అక్కడకి వెళ్లటానికి ఈ బిజి షెడ్యూల్ లో కుదరలేదు. బాగోదని ఇలా ట్రిక్ ప్లే చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఎంత అవసరం ఉన్నా...ఎవరైనా ఆరోగ్యం విషయంలో ఇలాంటి అబద్దాలు ఆడతారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
సమంత...సూర్యతో కలిసి ఆమె నటిస్తున్న సినిమా 'అంజాన్'. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తెలుగులో సికిందర్ టైటిల్ లో విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











