»   » ఎన్టీఆర్ ని కళ్లప్పగించి అలా చూస్తూ...సమంత

ఎన్టీఆర్ ని కళ్లప్పగించి అలా చూస్తూ...సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బృందావనం'లో ఎన్టీఆర్‌ తో జోడీ కట్టే అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఎన్టీఆర్‌ ఓ అద్భుతమైన నటుడు. ఆయన డైలాగులు చెబుతున్నా, డ్యాన్స్‌ చేస్తున్నా...కళ్లప్పగించి అలా చూస్తుండిపోవాలి. ఆయన షాట్‌లో ఉండగా వన్‌ మోర్‌ టేక్‌ అనే మాటే నేను వినలేదు. అసలు ప్రశ్నే లేని సమాధానం అంటూ ఉంటే అది ఎన్టీఆరే అంటోంది సమంత. ఏ మాయ చేసావె చిత్రంతో పరిచయమైన ఈ ముద్దు గుమ్మ ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. ఆ విషయాలను ప్రస్దావిస్తూ..'బృందావనం' ఒప్పుకొన్నాక నేను చేసిన మొదటి పని ఎన్టీఆర్‌ సినిమాలేమాలు వరస పెట్టి చూడ్డమే.'అదుర్స్‌', 'యమదొంగ', 'స్డూడెంట్‌ నెంబర్‌ వన్‌' ఇలా...ఎన్టీఆర్‌ నటించిన సినిమాలన్నీ చూశా. ఇది కూడా ఓ హోమ్‌ వర్క్‌ లా ఉపయోగపడింది. అలాగే ఎన్టీఆర్‌ లాంటి స్టార్ హీరోల సినిమా అంటే ఇక ఏమీ ఆలోచించను అంటోందీమె.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu