ది ఫ్యామిలీ మ్యాన్ 2తో సరికొత్త రికార్డు అందుకున్న సమంత
ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో మరో కొత్త దశ మొదలైందనే చెప్పాలి. సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఓటీటీ వరల్డ్ లో బిజినెస్ వందల కోట్లకు చేరుతోంది. సినిమాలను డైరెక్ట్ గా కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్ లకు కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. ఇక ఇటీవల వచ్చిన ది ఫ్యామిలీ మెన్ 2 అయితే సరికొత్త సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ కంటెంట్ లో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. శ్రీలంకకు చెందిన రాజీ అనే పాత్రలో కనిపించిన సమంత కొన్ని సన్నివేశాల్లో మరింత బోల్డ్ గా నటించింది. సోషల్ మీడియాలో సమంత పేరు ఈ వెబ్ కంటేట్ వల్ల బాగానే వైరల్ అయ్యింది. ఇక IMDB విడుదల చేసిన మోస్ట్ పాపులర్ షోలలో కూడా 'ది ఫ్యామిలీ మెన్ 2' 4వ స్థానంలో నిలిచింది.

హాలీవుడ్ వెబ్ కంటెంట్స్ తో సమానంగా పోటీని ఇచ్చినట్లు అర్ధమయ్యింది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించినప్పటికీ సౌత్ నుంచి మాత్రం సమంత ద్వారానే 'ది ఫ్యామిలీ మెన్ 2'కు బాగా క్రేజ్ దక్కింది. ప్రముఖ హాలీవుడ్ షోలు 'లోకి', స్వీట్ టూత్, మేర్ ఈస్ట్ టౌన్.. వంటి షోలు మొదటి 3 స్థానాల్లో ఉండగా వాటి తరువాత ది ఫ్యామిలీ మ్యాన్ 2 నిలవడం విశేషం. ఇక 'ది ఫ్యామిలీ మెన్ 3' కుండా ఉంటుందని ఇప్పటికే అనేక రకాల కథనాలు వస్తున్నాయి. మరి రాజ్ అండ్ డీకే మూడవసారి ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











