»   » అనుకున్నదే జరిగింది : నితిన్ కి ఆమే ఖరారు

అనుకున్నదే జరిగింది : నితిన్ కి ఆమే ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్‌ హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారు. హీరోయిన్ గా సమంతను ఎంచుకొన్నారు. మొదట నుంచి సమంత హీరోయిన్ గా చేస్తూందనే వార్తలు వచ్చాయి. సమంత వరసగా త్రివిక్రమ్ చిత్రాల్లో చేస్తూ ఉండటంతో ఈ సారి ఉండకపోవచ్చునని కథనాలు వినిపించాయి. అయితే నితిన్ మాత్రం ఆమెనే హీరోయిన్ గా అడిగినట్లు త్రివిక్రమ్ ఒప్పించినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది. నితిన్‌, సమంత కలసి నటించడం ఇదే తొలిసారి. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత.

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌తో ఇది మా మూడో చిత్రం. ఇది వరకు తెరకెక్కించిన 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' మంచి విజయం సాధించాయి. నితిన్‌ చిత్రంతో హ్యాట్రిక్‌ కొడతాం. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు త్వరలో ప్రకటిస్తాము''అన్నారు. వచ్చే నెల మూడో వారంలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Samantha to Romance Nithin for Trivikram

సమంత ప్రక్కన చేయాలని నితిన్ కు ఎప్పటినుంచో ఉందని అది ఈ చిత్రం తో తీరనుందని అంటున్నారు. అంటే త్రివిక్రమ్ కన్నా సమంతకే నితిన్ ప్రయారిటీ ఇచ్చారని అనుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ ఇంతకు ముందు అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో సమంత ని తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో వెంటనే సమంత ఓకే చేసి,డేట్స్ ఎలాట్ చేసిందని చెప్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: రాజీవన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.డి.వి. ప్రసాద్‌, సమర్పణ: మమత, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్‌.

గతంలో...

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

Samantha to Romance Nithin for Trivikram

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
Samantha also is to get roped up with Nithin for Trivikram Srinivas's flick. Samantha who maintains a good rapport with the star director Trivikram is to be seen romancing Nithin in this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu