»   » ఆ రాజకీయ పార్టీకి సమంత బహిరంగ మద్దతు!

ఆ రాజకీయ పార్టీకి సమంత బహిరంగ మద్దతు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశంలోని పలు రాజకీయ పార్టీలు సినిమా తారల మద్దతు కోసం ఉవ్విల్లూరుతున్న సంగతి తెలిసిందే. ఏదో ఒక విధంగా తమ తమ పార్టీలకు వారి మద్దతు కూడగట్టేందుకు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నాయి. కొన్ని పార్టీలు ఏకంగా సినిమా తారలకు పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు కూడా కేటాయిస్తున్నాయి. సినిమా తారల అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకునేందుకే ఇదంతా...

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రాజకీయాల గురించి మాట్లాడటం, ఓ రాజకీయ పార్టీ గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని 'ఆమ్ ఆద్మీ పార్టీ' అనూహ్యంగా ఎక్కువ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Samantha

'ఆమ్ ఆద్మీ పార్టీ' వల్లనే అవినీతి కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుపై సమంత తన ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అన్ని స్థానాలు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఢిల్లీలో గొప్ప ప్రారంభం. దేశం మొత్తం ఇలాంటి మార్పు జరుగుతుందని భావిస్తున్నాను' అంటూ సమంత ట్విట్టర్లో పేర్కింది.

సమంత వ్యాఖ్యలు చూస్తుంటే....అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆమె ఆనందంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఎంజాయ్ చేస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయినా మనకెందుకులెండి ఇంకా ఎక్కువగా ఊహించుకుంటే.....నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ సమంత ఫీలవుతుందేమో?

English summary
‘U didn't expect this from AAP did u? Brilliant start with Delhi.And I believe the rest of India will follow.The winds of change.' Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu