twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వెంటబడే అబ్బాయిని నిలదీస్తే...: సమంత

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''నేను చదువుకునే రోజుల్లో బస్టాప్‌లో ఓ అబ్బాయి నా వెంట పడేవాడు. ఓ సారి గట్టిగా నిలదీసేసరికి 'నువ్వేమన్నా పెద్ద అందగత్తెవనుకుంటున్నావా?' అని అడిగేశాడు. ఇది నా జీవితంలో మర్చిపోలేను'' అన్నారు సమంత. ప్రిన్స్‌, శ్రీదివ్య జంటగా నటించిన చిత్రం 'బస్‌స్టాప్‌'. మారుతి దర్శకుడు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని సమంత ఆవిష్కరించారు. సునీల్‌ స్వీకరించారు. అతిథిగా విచ్చేసిన సమంత ఇలా తన గత రోజులు గుర్తు చేసుకున్నారు.

    ముఖ్య అతిధి కీరవాణి మాట్లాడుతూ ''ఏ సంగీత దర్శకునికైనా కీబోర్డ్ ప్లేయర్ లేకపోతే పని నడవదు. సంగీత శాఖలో ఎంతమంది పనిచేసినా సింహభాగం మాత్రం కీ బోర్డ్ ప్లేయర్‌దే. జీవన్‌బాబు మంచి కీ బోర్డ్ ప్లేయర్. 'మగధీర'లోని 'పంచదార బొమ్మ బొమ్మ...' పాటలో 'నిన్ను పొందేటందుకె పుట్టానే బొమ్మ' అనే లైన్ తర్వాత వచ్చే బీట్ జీవన్‌బాబు క్రియేషనే. అప్పుడే తను మంచి సంగీత దర్శకుడవుతాడు అనిపించింది. అనుకున్నట్టే సంగీత దర్శకునిగా కూడా తను సక్సెస్ అయ్యాడు. దర్శకునిగా మారుతికి, సంగీత దర్శకునిగా జీవన్‌బాబుకి ఇది రెండో ప్రయత్నం. ఈ సినిమా 'ఈ రోజుల్లో'ని మించిన సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

    నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ''నేనూ బస్టాప్‌లో ఓ ప్రేమ కథ నడిపినవాణ్నే. నేను ప్రేమించిన అమ్మాయికి నా చేతులతోనే పెళ్లి చేశాను. చాలామంది ప్రేమలు బస్‌స్టాప్ నుంచే మొదలవుతాయి. కొన్ని సఫలం అవుతాయి. కొన్ని విఫలమవుతాయి. ఈ నేపథ్యంలోనే 'బస్‌స్టాప్' సినిమా ఉంటుంది. నాకెప్పట్నుంచో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తీయాలని ఉండేది. ఆ కోరికను 'బస్‌స్టాప్'తో తీర్చేశాడు మారుతి. యూత్‌కే కాదు, ఫ్యామిలీస్‌కి కూడా నచ్చే సినిమా ఇది. త్వరలోనే ప్రిన్స్‌తో ఓ యాక్షన్‌ చిత్రం నిర్మిస్తాను'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''నా జీవితంలో బస్టాప్‌ జ్ఞాపకాలు లేవుకానీ నేను స్వయంగా చూసిన సంఘటనలతో ఈ కథను అల్లుకున్నాను. వేటూరి ఈ చిత్రానికి రెండు పాటలు రాయడం నా అదృష్టం. జె.బి సంగీతం హుషారు తెప్పించేలా ఉంది'' అన్నారు. సాగర్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, సుధీర్‌బాబు, నందినిరెడ్డి, దేవీప్రసాద్‌, శివనాగేశ్వరరావు, వాసు, భాస్కరభట్ల, ప్రభాకర్‌రెడ్డి, ప్రిన్స్‌, రక్షిత, శ్రీదివ్య, జె.బి తదితరులు పాల్గొన్నారు.

    హాసిక, గోపాల్‌సాయి, రావు రమేష్‌, శ్రీను, డి.ఎం.కె, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంగీతం: జె.బి. ఛాయాగ్రహణం: జె.ప్రభాకరరెడ్డి. డ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాత: బి. మహేంద్రబాబు. ఈ చిత్రానికి కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, కొరియోగ్రఫీ: రఘు, సతీశ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

    English summary
    Samantha was the star attraction at the audio launch of director Maruthi's (Ee Rojullo fame) new film Bus Stop. The actress has unveiled the film's audio at a grand function held at Shilpa Kala Vedika on Saturday. Starring Prince and Sri Divya, the film is produced by Bellamkonda Suresh under Sai Ganesh Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X