»   » బాహుబలి2 మధ్యలో లేచి వెళ్ళిపోయింది.... సమంతా ఎందుకలా అంటే..

బాహుబలి2 మధ్యలో లేచి వెళ్ళిపోయింది.... సమంతా ఎందుకలా అంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 ఇప్పుడు ఇండియా మొత్తం ఊపేస్తున్న మానియా. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అంతా మొదటిరోజునే థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి మరీ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వారిలో అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత కూడా ఉంది. అయితే ఈ సినిమా తొలిరోజు స్క్రీనింగ్ కు విచ్చేసిన సమంత.. మధ్యలోనే బయటకు వెళిపోయిందట...

40 మంది పిల్లలతో కలిసి

40 మంది పిల్లలతో కలిసి

సమంత ప్రత్యూష ఫౌండేషన్ నిర్వహిస్తోందనే విషయం తెలిసిందే. ఆ ఫౌండేషన్ తరఫునే సుమారు 40 మంది పిల్లలతో కలిసి బాహుబలి-2 సినిమాకు అమీర్ పేటలోని బిగ్ సినిమాస్ లో మొదటి రోజు మొదటి ఆట చూడటానికి వెళ్లింది. అయితే ఆ రోజున థియేటర్ లో ఏసీ మాత్రం అస్సలు పనిచేయలేదట.

సమంత వల్ల కాలేదట

సమంత వల్ల కాలేదట

కేవలం ఫ్యాన్ లు మాత్రమే పనిచేశాయట. మండు వేసవిలో జనాలతో నిండిపోయిన థియేటర్ లో ఏసీ లేకుండా సినిమా చూడాలంటే మాటలు కాదు కదా... పిల్లలంటే ఏదోరకంగా సర్దుకుపోయి సినిమా చూసేశారు కానీ సమంత వల్ల మాత్రం కాలేదట. పాపం ఆ వేడిని భరించలేకపోయిందట సమంతా

ఇంటర్వెల్ కన్నా ముందే

ఇంటర్వెల్ కన్నా ముందే


దాంతో ఇంటర్వెల్ కన్నా ముందే సీటులో నుంచి లేచి బయటకు వచ్చేసిందని చెబుతున్నారు సన్నిహితులు. అయితే అక్కడితో అయిపోతే ఎలా టాలీవుడ్ అద్బుతం అనిపించుకున్న బాహుబలి ని చూడకుంటే ఎలా మరి? అందుకే మళ్ళీ ఇంకోసారి వెళ్ళిందట...

బాహుబలి గురించి స్పందించటానికి

బాహుబలి గురించి స్పందించటానికి

అందుకే మే 1న మాట్లాడిందినప్పుడు మత్రమే ఆలస్యంగా బాహుబలి గురించి స్పందించటానికి కారణం అదేనట. అదీ విషయం ఎండాకాలం లో మరీ ఏసీ లేకుండా తట్టుకోలేకపోయింది పాపం... అయినా బాహుబలి చూడాలన్న కోరికని మాత్రం తీర్చేసుకుంది... బాహుబలి ఎండతో కూడా సినిమా చూపించేసాడన్నమాట .

    English summary
    Reports says Samantha Walkout From Baahubali 2 Theater because of AC failure
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu