ఏకంగా 10భాషల్లో సమంత క్రేజీ ప్రాజెక్ట్.. నెవర్ బిఫోర్ అనేలా..
అక్కినేని వారి కోడలు సమంత హీరోయిన్ గా సినిమాలు కాస్త తగ్గించినా కూడా క్రేజ్ మాత్రం అలానే ఉంది. అభిమానులు ఇంకా జెస్సిగానే ట్రీట్ చేస్తున్నారు అంటే తన గ్లామర్ తో ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం హీరోయిన్ గానే కాకుండా అవసరం అయితే సపోర్టింగ్ పాత్రల్లో కూడా నటిస్తోంది. ఇక హోస్ట్ గానే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా బిజీ కాబోతోంది.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో సమంత వెబ్ సిరీస్ వరల్డ్ లోకి అడుగుపెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ ఫిబ్రవరిలో ముగియనుంది. అయితే ఈ షో గురించి చాలా రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. క్రేజీ అప్‌డేట్ ఏమిటంటే, ఈ షోను 10 అంతర్జాతీయ భాషల్లో డబ్ చేస్తున్నారు. అందువల్లే రెండవ సీజన్ చాలా ఆలస్యం అయ్యిందట.

తెలుగు వాళ్ళైన రాజ్, డికె దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో సమంతా ఉగ్రవాదిగా కనిపించనుంది. ఈ షోలో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక సమంత ఈ సిరిస్ తో పాటు త్వరలో మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరిస్ తో కూడా ఆకట్టుకొనున్నట్లు తెలుస్తోంది. కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తున్న శామ్ నచ్చకపోతే అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా రిజెక్ట్ చేస్తోందని టాక్.


Click it and Unblock the Notifications










