»   »  రీల్ లైఫ్ ‘ప్రేమమ్‌’, రియల్ లైఫ్ ‘ప్రేమమ్‌’విషెష్

రీల్ లైఫ్ ‘ప్రేమమ్‌’, రియల్ లైఫ్ ‘ప్రేమమ్‌’విషెష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాగచైతన్య, శ్రుతిహాసన్‌ జంటగా రూపుదిద్దుకున్న 'ప్రేమమ్‌' చిత్రాన్ని దసరా కానుకగా ఈ రోజు విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో 'ప్రేమమ్‌' చిత్రం చక్కగా ఆడుతుందన్న విషయం తనకు తెలుసని హీరోయిన్ సమంత అన్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో సమంత ఇవాళ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.


'ప్రేమమ్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జైటింగ్‌గా ఉంది, ఈ సినిమా బాగా ఆడుతుందని నాకు తెలుసు నాగచైతన్య' అని సమంత ట్వీట్‌ చేశారు. గత కొద్ది ఏళ్లుగా సమంత, చైతన్య ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

మలయాళంలో విజయం సాధించిన ప్రేమమ్‌కి రీమేక్‌గా తెలుగులో అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ సూర్యదేవర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రాజేశ్‌ మురుగేశన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులో తెరకెక్కించారు.

Samantha wishes all the best to Chaitu

అలాగే వెంకటేష్‌కి నాగ చైతన్య ముద్దుల మేనల్లుడు. చైతూ అంటే వెంకీకి చెప్పలేనంత ప్రేమ. ఇద్దరూ కలిసి నటించాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. తన వారసులందరినీ కలిపి ఓ సినిమాని నిర్మించాలని అప్పట్లో డి.రామానాయుడు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ కథే కుదర్లేదు. అయితే ఇప్పుడు వెంకీ, నాగచైతన్య కలిసి తెరను పంచుకొనే సమయం వచ్చింది. 'ప్రేమమ్‌'లో వెంకటేష్‌ ఓ అతిథి పాత్రని పోషించారు. సినిమాలో ఆ ఇద్దరూ మామాఅల్లుళ్లుగానే కనిపిస్తారు. సినిమాలోనూ నిజ జీవిత పాత్రల్లోనే దర్శనమిస్తారన్నమాట.

    English summary
    Naga Chaitanya’s latest film ‘Premam’ is releasing today. His beau Samantha has taken to Twitter to wish him luck. She wrote, " All the very best to the team of #premam . Excited because I know it's going to be good chay_akkineni."
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu