»   » ఇక రవితేజతోనూ అదరకొట్టనున్న సమంతా?

ఇక రవితేజతోనూ అదరకొట్టనున్న సమంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ మాయ చేసావె ఫేమ్ సమంతా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హాట్ ప్రాపర్టీ. ఆమెకు పెద్ద హీరోల నుంచి వరసగా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. తాజాగా ఆమె రవితేజ సరసన కూడా ఎంపికయినట్లు సమాచారం. 'కత్తిలాంటోడు' టైటిల్ తో నిర్మితమయ్యే ఈ చిత్రాన్ని రెయిన్‌బో రీల్స్‌ అనే నూతన సంస్థ నిర్మిస్తోంది. డైరక్టర్ మిగతా వివరాలు ఇంకా బయిటకు రాలేదు. అలాగే సమంతా ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. మున్నా ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రంలోనూ చేస్తోంది. ఇక 'కత్తిలాంటోడు' టైటిల్ బయిటకు రాగానే మంచి క్రేజ్ వచ్చింది. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ, రమేష్ వర్మ దర్శకత్వంలో వీర సినిమాలు చేయనున్నారు. అలాగే గోపీచంద్ అనే నూతన దర్శకుడుతో చేస్తున్న 'డాన్‌శీను' చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu