»   » అలాంటి పాత్రలు చేయాలంటే చాలా కష్టం...సమంత

అలాంటి పాత్రలు చేయాలంటే చాలా కష్టం...సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఏ పాత్ర అయినా చేసేస్తాను..అలాగే కండిషన్స్ పెట్టి ఇలాంటివే కావాలి అనను అదే నా సక్సెస్ సూత్రం అంటోంది సమంత. అలా ఎందుకు ఏ పాత్ర అయినా ఓకే అంటానంటే..నాకు వ్యక్తి గతంగా...ఇది అది అని లేకుండా అన్ని రకాల పాత్రలు పోషించాలని ఉంది.విభిన్నమైన పాత్రల్ని పోషించి మరింత పేరు సంపాదించాలి అలాగని మరీ ఏంజెలీనా జోలీ చేసిన 'టాంబ్‌ రైడర్‌' లాంటి పాత్రలయితే కష్టమే. ఆ యాక్షన్‌ సన్నివేశాలు మామూలుగా ఉండవు. చూస్తుంటేనే ఎంత కష్టపడి చేసారో అర్దమైపోతుంది. ఏదైమైనా ప్రయత్న లోపం లేకుండా కష్టపడే మనస్తత్వం నాది అంది. ఇక ప్రస్తుతం సమంత...మహేష్ తో కలిసి 'దూకుడు' చిత్రం చేస్తుంది. అలాగే ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ'తో పాటు..గౌతమ్‌ మీనన్‌ 'ఎర్రగులాబీలు'లో కనిపించబోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu