»   » ట్రెడిషనల్‌గా హీరోయిన్ సమీరారెడ్డి వివాహం (ఫోటోలు)

ట్రెడిషనల్‌గా హీరోయిన్ సమీరారెడ్డి వివాహం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి సమీరారెడ్డి మీడియా కంట పడకుండా తన వివాహం జరుపుకుంది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం వ్యాపార వేత్త అక్షయ్ వర్దేను ముంబయ్ లోని బాంద్రాలో సమీరా పెళ్లాడింది. అయితే పెళ్లయిన తర్వాత వివాహానికి సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేసారు.

స్పెషల్ డిజైన్డ్ మోటార్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అక్షయ్ వర్దేతో సమీరా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సమీరా, అక్షయ్‌ల నిశ్చితార్థం డిసెంబర్‌లో జరిగింది. వర్దేంచి పేరుతో అక్షయ్ తయారు చేసే మోటార్ బైక్స్ ను సమీరా ఇష్టంగా వినియోగించేది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి మోటార్ బైక్ కారణమని సమీరా స్నేహితురాలు తెలిపింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఓ మై గాడ్' చిత్రం కోసం వీరి సంస్థ ప్రత్యేకంగా బైకును డిజైన్ చేసింది. వీరి వివాహ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

సమీరారెడ్డి మన తెలుగమ్మాయే. రాజమండ్రిలో జన్మించింది. ఆమె తండ్రిపేరు సి.పి.రెడ్డి. సమీరా చిన్నతనంలోనే వీరి ఫ్యామిలీ ముంబైకి షిప్టయింది. ముంబైలోనే పెరిగిన సమీరా మోడలింగ్ రంగంలో ప్రవేశించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్లైడ్ షోలో వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు....

సమీరా రెడ్డి, అక్షయ్ వర్ధే

సమీరా రెడ్డి, అక్షయ్ వర్ధే


సమీరా రెడ్డి, అక్షయ్ వర్దే సాంప్రదాయ బద్ధంగా వివాహ మాడారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం


సమీరా రెడ్డి, అక్షయ్ వర్దేలది ప్రేమ వివాహం. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోంది. వర్దేంచి పేరుతో అక్షయ్ తయారు చేసే మోటార్ బైక్స్ ను సమీరా ఇష్టంగా వినియోగించేది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి మోటార్ బైక్ కారణమని సమీరా స్నేహితురాలు తెలిపింది.

స్పెషల్ బైక్‌పై...

స్పెషల్ బైక్‌పై...


స్పెషల్ డిజైన్డ్ మోటార్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అక్షయ్ వర్దే ఇలా....స్పెషల్ బైక్‌పై వివాహానికి హాజరయ్యారు.

అల్లుడికి ఆహ్వానం

అల్లుడికి ఆహ్వానం


కాబోయే అల్లుడు అక్షయ్ వర్దేకు ఆహ్వానం పలుకుతున్న సమీరారెడ్డి తల్లి నక్షత్రరెడ్డి

కాళ్లు కడుగుతూ...

కాళ్లు కడుగుతూ...


సాంప్రదాయ ప్రకారం అల్లుడికి కాళ్లు కడిగి లోనికి ఆహ్వానిస్తున్న సమీరారెడ్డి తల్లి.

సుష్మారెడ్డి

సుష్మారెడ్డి


సమీరారెడ్డి సోదరి సుష్మారెడ్డి....ఇలా బొట్టు పెట్టి ఆహ్వానించింది.

సందడిగా, సంతోషంగా

సందడిగా, సంతోషంగా


వివాహ వేడుకలో అంతా ఎంతో సంతోషం, సందడిగా కనిపించారు.

సమీరా కుటుంబ సభ్యులు

సమీరా కుటుంబ సభ్యులు


తమ ఇంటికి కాబోయే అల్లుడు అక్షయ్ వర్దే రాగానే సమీరా రెడ్డి కుటుంబ సభ్యులు ఇలా స్వాగతం పలికారు.

సమీరారెడ్డి

సమీరారెడ్డి


తెలుగు కుటుంబానికి చెందిన వారే అయినప్పటికీ మహారాష్ట్రలో స్థిర పడటంతో సమీరా రెడ్డి వివాహం మరాఠీ సాంప్రదాయంలో జరిగింది.

సంగీత్

సంగీత్


పెళ్లికి ముందు జరిగే సంగీత్ సెర్మనీలో సమీరారెడ్డి, అక్షయ్ వర్ధే.

చూడముచ్చటైన జంట

చూడముచ్చటైన జంట


ఈ ఫోటో చూస్తుంటే ఈ జంట ఎంతో చూడ ముచ్చటగా ఉందని అనిపిస్తోంది కదూ...!

సందడే సందడి

సందడే సందడి


సంగీత కార్యక్రమం ఎంత సందడిగా సాగిందో చెప్పడానికి ఈ ఫోటోయే నిదర్శం...

అతిథులు

అతిథులు


సమీరారెడ్డి, అక్షయ్ వర్దే వివాహ కార్యక్రమానికి హాజరైన అతిథులు

English summary

 Actress Sameera Reddy tied the knot with fiance Akshai Varde in Mumbai on 21 January. It was a Maharashtrian style wedding attended by Sameera and the groom's close family members and friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu