»   » 'ఊసరివిల్లి'లో ఆ హైలెట్ రూమరే

'ఊసరివిల్లి'లో ఆ హైలెట్ రూమరే

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవిల్లిలో హైలెట్ గా సమీరా రెడ్డి ఐటం సాంగ్ ఉందటూ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఊసరవిల్లి యూనిట్ క్లారిఫై చేస్తూ..సినిమాలో సమీరా రెడ్డి లేదని తేల్చారు. అది కేవలం రూమర్ మాత్రమేనన్నారు. అలాంటి ఆలోచనే ఎవరికి లేదన్నారు. ఇక ఈ చిత్రం దసరాకి వస్తుందని, అందుకోసం ఎన్టీఆర్ రాత్రింబవళ్ళూ షెడ్యూల్స్ లో పనిచేస్తున్నాడని చెప్తున్నారు.

ఇక గత దసరాకి ఎన్టీఆర్ బృందావనం చిత్రం విడుదలై విజయం సాధించటంతో అదే సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని ఆ సమయానికే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఊసరివిల్లి చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చే్స్తున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అశోక్ తర్వాత ఎన్టీఆర్,సురేంద్రరెడ్డి కలిపిచేస్తున్న చిత్రం ఇది. కిక్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన సురేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని మరో బ్లాక్ బస్టర్ గా రూపొందిస్తున్నారు.

English summary
So Oosaravelli film unit denied the rumors that Sameera Reddy is doing a role or song in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu