»   » మాజీ లవర్ తో మళ్లీ జూ ఎన్టీఆర్ రొమాన్స్ ..?

మాజీ లవర్ తో మళ్లీ జూ ఎన్టీఆర్ రొమాన్స్ ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ కీ, సెక్సీ భామ సమీరా రెడ్డికీ మధ్య ఒకప్పుడు ఎఫైర్ వార్తలు బలంగా విన్పించాయి లాలీవుడ్ సర్కిల్స్ లో. 'అశోక్", నరసింహుడు" సినిమాలో జూ ఎన్టీఆర్ సరసన సమీరా రెడ్డి నటించింది. నందమూరి సమీరా రెడ్డి..అంటూ జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ సినిమా కార్యక్రమంలో సమీరా రెడ్డి చూస్తూ నినాదాలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా పెద్ద గ్యాప్ వచ్చేయడం..టాలీవుడ్ లో ఆమె మళ్ళీ కనిపించకపోవడం తెల్సిన విషయాలే. మొన్నీమధ్యనే ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరపై హడావిడి చేసిన సమీరా రెడ్డి, చాలా కాలం తర్వాత మరో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించనుందట..అదీ జూ ఎన్టీఆర్ తోనేనని సమాచారం.

జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఊసరవెల్లి" సినిమాలో సమీరా రెడ్డి నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్ కాదనీ, ఓ స్పెషల్ సాంగ్ లో కన్పించనుందనీ తెలుస్తోంది. ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి, సమీరా రెడ్డి కాంబినేషన్ లో 'అశోక్" సినిమా గతంలో తెరకెక్కిన సంగతి విదితమే..

English summary
Young Tiger Jr Ntr, Tamanna are pairing up for a new flick Oosaravelli in the direction of Surender Reddy. The shooting schedule of the film is currently taking place in Ramoji Film City, Hyderabad. The latest buzz is Sameera reddy is doing item song in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu