»   » సీక్రెట్‌గా సమీరారెడ్డి వివాహం!

సీక్రెట్‌గా సమీరారెడ్డి వివాహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోయిన్ సమీరారెడ్డి ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. సమీరా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 14న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వీరి వివాహం గ్రాండ్ జరుగుతుందని అంతా ఊహించారు. కానీఅందరి ఊహలను తారుమారు చేస్తూ నేడు (జనవరి 21) రహస్యంగా, నిరాడంబరంగా వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కొందరు బంధువులు, స్నేహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరు కానున్నారట. ముంబైలోని బాంద్రాలో పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా వీరి వివాహం జరుగనుంది.

అక్షయ్ వర్దేకు ముంబైలో కస్టమ్ మేడ్ మోటారు బైకులకు సంబంధించిన బిజినెస్ ఉంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఓ మై గాడ్' చిత్రం కోసం వీరి సంస్థ ప్రత్యేకంగా బైకును డిజైన్ చేసింది. సమీరారెడ్డి మన తెలుగమ్మాయే. రాజమండ్రిలో జన్మించింది. ఆమె తండ్రిపేరు సి.పి.రెడ్డి. సమీరా చిన్నతనంలోనే వీరి ఫ్యామిలీ ముంబైకి షిప్టయింది. ముంబైలోనే పెరిగిన సమీరా మోడలింగ్ రంగంలో ప్రవేశించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగక పోయినా బాలీవుడ్ సినిమాలతో పాటు ఇటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది సమీరారెడ్డి. సమీరా రెడ్డి అన్ని సినీ పరిశ్రమల వారికి సుపరిచితమే. తెలుగు కుటుంబానికి చెందిన సమీరా....బాలీవుడ్‌ సినిమాలతో పాటు తెలుగు, తమిళం ఇతర దక్షిణాది సినిమాల్లోనూ నటించింది.

English summary
Actress Sameera Reddy’s wedding to her beau Akshai Varde is slated for today. Though the fashionista had earlier announced that she would tie the knot in April, the wedding has reportedly been planned for today, January 21.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu