»   » స్టార్స్ మామూలు మనుషులు కాదు... ‘సమ్మోహనం’ ట్రైలర్ సూపర్

స్టార్స్ మామూలు మనుషులు కాదు... ‘సమ్మోహనం’ ట్రైలర్ సూపర్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sammohanam Movie Theatrical Trailer

  సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగాఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ రోజు సుధీర్ బాబు మామయ్య, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

  సినిమా అంటే ఇష్టం లేని హీరో.... సినిమా నటితో ప్రేమలో

  సినిమా అంటే ఇష్టం లేని హీరో.... సినిమా నటితో ప్రేమలో

  ఈ చిత్రంలో సుధీర్ బాబు ఆర్టిస్టు పాత్రలో నటిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటే పెద్దగా ఇష్టపడని మనస్తత్వం. అదితీ రావ్ హైదరి సినిమా హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమకథా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

  టేకింగ్ అద్భుతం...

  టేకింగ్ అద్భుతం...

  ట్రైలర్ చూసిన తర్వాత....దర్శకుడి టేకింగ్, అతడు సినిమాను ప్రజెంట్ చేసిన విధానంపై ఒక అంచనాకు వచ్చే విధంగా ఉంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని స్పష్టమవుతోంది.

  సుధీర్ బాబు, అదితీ పెర్ఫార్మెన్స్ కేక

  సుధీర్ బాబు, అదితీ పెర్ఫార్మెన్స్ కేక

  ఈ చిత్రంలో సుధీర్ బాబు నటన పరంగా గత చిత్రాలతో పోలిస్తే మరింత పరిణితి చెందాడని తెలుస్తోంది. ఇక హీరోయిన్ అదితీ రావ్ హైదరి ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా సూపర్బ్ అనేలా ఉంది.

  డైలాగ్స్ అదుర్స్...

  డైలాగ్స్ అదుర్స్...

  ఈ టైప్ అమ్మాయిలు అంత డిపెండబుల్ కాదు బాస్, మూడ్ మూడ్ కీ బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తారు.... ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్ తప్పనుకున్నాను నిన్ను చూసిన తర్వాత, కాదని చెంప పగలగొట్టిమరీ ప్రూవ్ చేశావు.... మనుషులను వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా కామన్ అనుకుంటా.... అంటూ సాగే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

  అంచనాలు పెంచిన ట్రైలర్

  ఓవరాల్‌గా ‘సమ్మోహనం' ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచిందని చెప్పక తప్పదు.

  న‌టీన‌టులు:
  సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి త‌దిత‌రులు.

  సాంకేతిక నిపుణులు:
  ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, ,నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

  English summary
  In a first, Tollywood superstar Krishna Today release the official trailer of Sudheer Babu starrer ‘Sammohanam’ on the occasion of his birthday. ‘Sammohanam’ starring Sudheer Babu and Aditi Rao Hydari in lead roles, has been one of the most discussed films ever in the actor’s career since its announcement.Naresh, Tanikella Bharani, Pavithra Lokesh and Rahul Ramakrishna will also be part of the film which is slated to release on June 15. The makers released multiple posters of the film, revealing the varied looks of the lead actors from the film. All the posters have gained immense appreciation from the audience and critics alike.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more