»   » ఘట్టమనేని వంశానికి ఓ ప్రత్యేకత.. గోపిచంద్ కోసం పవన్ కల్యాణ్..

ఘట్టమనేని వంశానికి ఓ ప్రత్యేకత.. గోపిచంద్ కోసం పవన్ కల్యాణ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ అభిరుచి గల దర్శకుల్లో ఒకరైన సంపత్ నంది డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు. డ్రగ్స్ వినియోగం సమాజానికి మంచి కాదు అని ఆయన అన్నారు. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం గౌతమ్‌నంద జూలై 27 రిలీజ్‌‌కు సిద్ధమవుతున్నది. ఈ నేఫథ్యంలో ఆ చిత్రాల విశేషాలను, డ్రగ్స్ వివాదంపై సంపత్ నంది ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా పంచుకొన్నారు. సంపత్ నంది ఏమన్నారో ఆయన మాటల్లోనే..

గౌతమ్.. గౌతమ్ నందగా ఎలా మారాడు..

గౌతమ్.. గౌతమ్ నందగా ఎలా మారాడు..

గౌతమ్ నంద కథ మంచి కంటెంట్ ఉన్న కమర్షియల్ కథ. సంపన్న కుటుంబానికి చెందిన గౌతమ్ అనే వ్యక్తి గౌతమ్‌నందగా ఏలా మారాడన్నది సినిమా కథ. గౌతమ్ నంద జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని కీలక అంశాలే ఈ సినిమా కథ.

Goutham Nanda Movie Public Talk And Review
గతంలో కథను బలంగా చెప్పలేకపోయాను..

గతంలో కథను బలంగా చెప్పలేకపోయాను..

నా గత చిత్రాల్లో కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకోవడం వల్ల కథను బలంగా చెప్పలేకపోయాను. కానీ ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలను జోడించి మంచి కథను రాసుకొన్నాను. తప్పకుండా కథ ప్రేక్షకులకు నచ్చుతుంది. కథను చక్కగా బ్యాలెన్స్ చేయడం జరిగింది.

ఆ విధంగా గోపిచంద్

ఆ విధంగా గోపిచంద్

రచ్చ సినిమా తర్వాత నిర్మాత భగవాన్, పుల్లారావులకు ఓ సినిమా చేసి పెట్టాల్సి ఉండేది. నా గత చిత్రం తర్వాత కథపై కూర్చున్నాను. స్టోరి పూర్తవ్వగానే నిర్మాతలకు వినిపించాను. కథ వారికి బాగా నచ్చింది. ఆ సమయంలో గోపిచంద్ డేట్స్ ఉన్నాయి. దాంతో గోపిచంద్ హీరోగా అనుకొని సినిమా చేశాం. సింగిల్ సిట్టింగ్‌లోనే కథ ఓకే అయ్యింది.

చాలా స్టయిలిస్ట్‌గా చూపించాం

చాలా స్టయిలిస్ట్‌గా చూపించాం

గౌతమ్ నంద చిత్రంలో రెండు రకాల షేడ్స్ ఉంటాయి. గౌతమ్ ఒక షేడ్. నంద ఒక షేడ్. ఈ రెండు కోణాలున్న పాత్ర కోసం గోపిచంద్‌ను చాలా స్టయిలీష్‌గా చూపించాలనుకొన్నాం. అందుకే పవన్ కల్యాణ్ హెయిర్ స్టయిలిస్ట్ రవితో ప్రత్యేకంగా లుక్ చేయించాం. అదీ గోపిచంద్ న్యూలుక్ వెనుక కథ.

ఘట్టమనేని వంశానికి ఓ ప్రత్యేకత

ఘట్టమనేని వంశానికి ఓ ప్రత్యేకత

ఈ సినిమాలో గౌతమ్ ఇంటి పేరు ఘట్టమనేని. ఈ చిత్రంలో గోపిచంద్ పాత్ర పేరు ఘట్టమనేని గౌతమ్. ఘట్టమనేని వంశంలో చాలా మంచి పేరున్న కుటుంబాలు ఉన్నాయి. వారి పిల్లలు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉన్నారు. సమాజంలో ఘట్టమనేని వంశానికి ఓ ప్రత్యేకత ఉంది. అందుకే ఆ పాత్రకు బలం చేకూరడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పాత్రకు పేరు పెట్టాం.

బిలియనీర్ల కొడుకుల గురించి

బిలియనీర్ల కొడుకుల గురించి

గోపిచంద్ పాత్ర కోసం చాలా మంది బిలియనీర్ల కుటుంబాలకు చెందిన వారసుల గురించి పరిశోధన చేశాం. వారు ఉండే స్టయిల్. జీవించే విధానం. డ్రెస్సింగ్ ఇతర అంశాలను క్షణ్ణంగా పరిశీలించాం. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం.

వానపాటలో మెరిసిన క్యాథరిన్

వానపాటలో మెరిసిన క్యాథరిన్

ఈ చిత్రంలో హన్సిక, క్యాథరిన్ తెర్సా కథానాయికలు. ఓ షాపులో సెల్స్ ఉమన్‌గా స్ఫూర్తి పాత్రలో హన్సిక కనిపిస్తుంది. ముగ్ద పాత్రలో క్యాథరిన్ నటించింది. ఈ సినిమాలో ముగ్ధ పాత్ర కోసం క్యాథరిన్ చాలా కష్టపడింది. వానపాటలో కష్టపడి డ్యాన్స్ చేసింది. వాన పాటలో పాలు, పౌడర్ చాలా ఉపయోగించాం. వాటన్నింటిని తట్టుకొని చాలా కష్టపడి పాటకు ఓ అందాన్ని తెచ్చింది. ఆమె కష్టం తెరమీద కనిపిస్తుంది.

English summary
Actor Gopichand's latest movie is Gautam Nanda. Hansika, Catherine tresa are lead pair. This movie releasing on 28th July. In this occassion, Director Sampath Nandi talks With filmibeat telugu about his forthcoming film Gautam Nanda movie and Drug case
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu