»   » త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా బాగా ఉపయోగపడింది

త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా బాగా ఉపయోగపడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను ఈ రంగంలోకి దర్శకుణ్ని కావాలనే వచ్చాను. త్రివిక్రమ్ శ్రీనివాస్‌, ఆకుల శివ 'దర్శకత్వం కంటే ముందు స్క్రిప్టుపై అవగాహన పెంచుకో' అని నాకు సలహా ఇచ్చారు. వారి మాటపై పోసాని కృష్ణమురళిగారి దగ్గర శిష్యరికం చేశాను. ఆ సలహా నాకెంతో ఉపకరించింది అంటున్నారు సంపత్ నంది. వరుణ్ సందేశ్ హీరోగా ఆయన రూపొందించిన 'ఏమైంది ఈ వేళ' చిత్రం 32 సెంటర్లలో యాభై రోజలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...నేను దాదాపు 30 చిత్రాలకు పని చేశాను. కొన్నాళ్లు ముంబయిలో ఉండి పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించాను. అక్కడ పలువురి దర్శకుల కథా చర్చల్లో పాల్గొన్నాను. అవే నా కెరీర్ కి ఉపకరించాయి అన్నారు.ఇక చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కూడా నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. రవితేజ, వినాయక్‌, సుకుమార్‌, కేఎస్‌ రామారావు, దానయ్య తదితరులు కథ చెప్పిన తీరు బాగుందన్నారు అని ఆనందం వెళ్ళబుచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu