»   » బన్నీతో చరణ్ దర్శకుడి సినిమా?

బన్నీతో చరణ్ దర్శకుడి సినిమా?

Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ ప్రస్తుతం నాపేరు సూర్య చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శించే బన్నీ ఈసారి కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. నాపేరు సూర్య చిత్రం అల్లు అర్జున్ చేబోయే చిత్రం గురించి క్లారిటీ లేదు. అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రాంచరణ్ దర్శకుడు సీన్ లోకి వచ్చినట్లు తాజా సమాచారం. చెర్రీకి రచ్చ వంటి సూపర్ హిట్ అందించిన సంపత్ నంది అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మాస్ కథలని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో సంపత్ నంది ప్రతిభావంతుడు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ అల్లు అర్జున్, సంపత్ నంది తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. సంపత్ నంది వివరించే కథ నచ్చితే అల్లు అర్జున్ ఒకే చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Sampath Nandi will going to direct Allu Arjun
English summary
Sampath Nandi will going to direct Allu Arjun. C Kalyan will produce this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X