»   » చిన్న పిల్లలు, గర్భిణి స్త్రీల మీద అఘాయిత్యం చేసేవి నాకొద్దు

చిన్న పిల్లలు, గర్భిణి స్త్రీల మీద అఘాయిత్యం చేసేవి నాకొద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఎవరికైనా ఓ కమిట్మెంట్ ఉండాలి. తను చేసి వృత్తి పట్ల నిబద్దత ఉండాలి. అప్పుడు విజయం దానంతట అదే వచ్చి వాలుతుంది. దాన్నే నమ్మతాను అంటున్నారు విలన్ పాత్రలతో తెలుగువారికి పరిచయమైన సంపత్ రాజ్. ఆయన ఆర్టిస్ట్ గా ఉన్న కమిట్ మెంట్ క్రింద చెప్పిన ఒక లైన్ చాలు.

'చిన్న పిల్లలు, గర్భిణి స్త్రీల మీద అఘాయిత్యానికి ఒడిగట్టే పాత్రల్లో నటించను' అని చెబుతున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ విలన్ సంపత్ రాజ్. సంపత్‌రాజ్ మాతృభాష తమిళం. పద్నాలుగు సంవత్సరాలు ఎడ్వర్‌టైజ్‌మెంట్ ఇండస్ట్రీలో పనిచేసిన సంపత్ ఎన్నో యాడ్ ఫిల్మ్స్, జింగిల్స్ చేశాడు.

ఆ సమయంలోనే సినిమాల మీద ప్రేమ చెన్నైకి తీసుకొచ్చింది. కెప్టెన్ విజయకాంత్ హీరోగా నటించిన 'నెరంజ మనసు'తో తమిళచిత్రసీమలో తన కెరీర్ ప్రారంభించాడు సంపత్‌రాజ్. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా మీద సంపత్‌కు చాలా అంచనాలు ఉన్నాయి. తండ్రి, కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేశాడు. అయితే... మొదటి రోజే సినిమా ఫ్లాప్ అంటూ ఫలితం తెలిసిపోయింది.

'నెరంజ మనసు' సినిమా ఫ్లాప్ అయినా... సుమారు ఆరు ఏడు మంది దర్శకుల నుంచి సంపత్‌కు ఆఫర్లు వచ్చాయి. ఇది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీని తరువాత మరోసారి విజయ్‌కాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా తమిళ సినిమాల జర్నీ మొదలైంది. తమిళ సినిమాకు ముందు రెండు కన్నడ చిత్రాల్లో నటించాడు. అందులో ఒకటి జాతీయ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించాడు సంపత్.

తెలుగు విషయానికి వచ్చే సరికి... 'దమ్ము' 'మిర్చీ' 'ఓమ్' 'రన్ రాజా రన్' 'పవర్' 'లౌక్యం' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'శ్రీమంతుడు' 'సోగ్గాడే చిన్నినాయనా'... మొదలైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సంపత్‌రాజ్.

Sampath raj about his characters

ఒక పాత్ర చేయాలని నిర్ణయించుకున్నాక... చేశాను అంటే చేశాను అన్నట్లు కాకుండా మానసికంగా ఆ పాత్రను విజువలైజ్ చేసుకుంటూ 'ఇలా చేస్తే ఎలా ఉంటుంది?' 'అలా చేస్తే ఎలా ఉంటుంది?' అని ఆలోచించుకొనిగానీ రంగంలోకి దిగడు. గుడ్డిగా నటించడం కాకుండా పాత్ర గురించి తనకు ఏవైనా సందేహాలు ఉంటే డెరైక్టర్ని అడిగి తీర్చుకుంటానని చెప్తున్నారీయన.

English summary
Sampath Raj said: "In the recent past, I have played all kinds of roles in industries like Telugu, ranging from comedian to positive, strong character roles. Now, I am looked at as an actor who can play all kinds of roles."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu