»   » సంపూర్ణేష్ బాబు ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు

సంపూర్ణేష్ బాబు ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నెట్ జనులలో ఓ రేంజి హైప్ క్రియేట్ చేసి, తన సినిమాకు ప్రేక్షకులను క్రియేట్ చేసుకున్న హీరో సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న సంపూర్ణేష్ ని స్పెషల్ గా ఆడియో పంక్షన్ కి పిలిచి డాన్స్ చేయిస్తున్నాడు సందీప్ కిషన్. ఆడియో పంక్షన్ లో స్పెషల్ సర్పైజ్ ఉంటుందని ట్విట్టర్ లో ట్వీట్ చేసి అందరిలో ఆసక్తి రేపిన సందీప్ కిషన్ ఆ సర్పైజ్ ఏమిటో రివిల్ చేసారు. అది మరోదో కాదు సంపూర్ణేష్ బాబు డాన్స్. అలాగే సంపూర్ణేష్ బాబు కి ఓ పాత్ర కూడా అతని చిత్రంలో ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మొదటి నుంచి సంపూర్ణేష్ బాబుని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.

సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య'. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఎస్వీకే సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత.

Sampoonesh Babu dance at Sandeep Kishan's audio

సందీప్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నా సినిమాలో ఒకరో, ఇద్దరో పెద్ద నటులు కనిపించేవారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ పెద్ద నటీనటులున్నారు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబుగారితో నటించడం ఆనందంగా ఉంది. మంచి లవ్ ఎంటర్‌టైనర్. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.

The one & only @sampoornesh babu will be performing live at #RaRaKrishnayya Audio Launch tomorrow..special thanks to Sampoo & @sai_rajesh :)
— Sundeep Kishan (@sundeepkishan) May 29, 2014

నిర్మాత మాట్లాడుతూ "మా సంస్థలో నిర్మిస్తున్న నాలుగో సినిమా ఇది. షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలో ఆడియో, వచ్చే నెల్లో సినిమాను విడుదల చేస్తాం. సందీప్ సోదరుడిగా జగపతిబాబు నటిస్తున్నారు. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది'' అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "జగపతిబాబు రోల్ సినిమాకు హైలైట్ అవుతుంది. మా నిర్మాత కథను నమ్మి అవకాశమిచ్చారు'' అని తెలిపారు. మంచి టీమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని రెజీనా, కాశీ విశ్వనాథ్, గణేష్ అన్నారు. కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: శ్రీరామ్, ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు.

English summary
Sandeep Kishan tweeted: "The one & only sampoornesh babu will be performing live at #RaRaKrishnayya Audio Launch ..special thanks to Sampoo :)"

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu