»   » అకారణంగా తిడుతున్నారు: బాధతో సంపూ బహిరంగ లేఖ

అకారణంగా తిడుతున్నారు: బాధతో సంపూ బహిరంగ లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిగ్ బాస్' ఇంటి పరిస్థితులను తట్టుకోలేక తనంతట తానుగా బయటకు వచ్చిన సంపూర్ణేష్ బాబుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కొందరైతే ఆయన్ను తీవ్రంగా దూషించడం మొదలు పెట్టారు. ఈ పరిణామాలపై సంపూర్ణేష్ బాబు స్పందించారు.

ముందుగా నన్ను ఇంతకాలం ఆదరించిన నా ప్రేక్షక దేవుళ్ళకి, అందరి హీరోల అభిమానులకి చేతులెత్తి నమస్కరిస్తూ.....వారికి కృతజ్ఞతలు క్షమాపణలు చెప్తున్నాను. మనకి కష్టమొచ్చినప్పుడు, మనం భుజం తట్టిన వాడే నిజమైన హీరో. మానసిక సంఘర్షణకి గురి అయినప్పుడు నన్ను ఇంతటి ప్రేమకి పాత్రుడిని చేసిన రియల్ బిగ్ బాస్ మా "తారక్" అన్న కు సదా రుణ పడి వుంటాను. అంటూ సంపూర్ణేష్ బాబు ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు.

అకారణంగా తిడుతున్నారు

అకారణంగా తిడుతున్నారు

‘నా మనసులో భావాలు ఇక్కడ చెప్తున్నాను. ఎక్కువ మంది బిగ్ బాస్‍‌లో నా నిష్క్రమణ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు. అయితే కొందరు అకారణంగా సోషల్ నెట్వర్కింగ్‌లో దూషించటం బాధ కలిగించింది' అని సంపూ తెలిపారు.

పిరికితనం కాదు, క్లాస్త్రోఫోబియా

పిరికితనం కాదు, క్లాస్త్రోఫోబియా

‘బిగ్ బాస్ ఇంటి నుండి పిరికితనం వల్లో, మరో కారణం చేతనో రాలేదు. నేను బయటకు రావడానికి కారణం "క్లాస్త్రోఫోబియా". ఒక రూమ్‌లో బాధించబడినప్పుడు, ఒక రకమైన, అందునా పూర్తిగా నాకు స్పృహ లేని స్థితిలో, ఆర్థికంగా, చట్టపరంగా చర్యలు వుంటాయని తెలిసినా బిగ్ బాస్ నుంచి నిష్క్రమించటం జరిగింది' అని సంపూ తెలిపారు.

నా వృత్తికి లింక్ పెట్టొద్దు

నా వృత్తికి లింక్ పెట్టొద్దు

‘ఇది కేవలం పిరికితనంతో చేసిందిగా భావించి, నేను నటించే నా వృత్తికి లింక్ పెట్టటం చాలా బాధ కలిగింది. దూషణలు నాకు కొత్త కాదు. నటించడం ఈ జన్మకు దొరికిన అదృష్టం. నేనెప్పుడూ సమాజానికి సేవ చేస్తూ మీతో కలిసి వుండాలని కోరుకుంటున్నాను' అని సంపూ వ్యాఖ్యానించారు.

పోలీస్ స్టేషన్లో కూడా ధైర్యం సడలలేదు

పోలీస్ స్టేషన్లో కూడా ధైర్యం సడలలేదు

ఎన్నో కష్టాల్లో మీతో కలిసే వున్నాను, ఏపీ స్పెషల్ స్టేటస్ సమయంలో 10 గంటలు పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఒంటరిగా గడిపినప్పుడు కూడా నా ధైర్యం సడలలేదు. కానీ మొదటిసారి మనసు బాధ కలిగింది.... అని సంపూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ వార్తలో నిజం లేదు

ఆ వార్తలో నిజం లేదు

నా పై ఎప్పటిలాగే ప్రేమ చూపించిన వెబ్ సైట్స్, టీవీ చానెల్స్ వారికి నా నమస్కారాలు. ఒకటి రెండు వెబ్సైట్‌లో రాసినట్టుగా, నాకు 15 లక్షల జరిమానా, ఆత్మహత్య ప్రయత్నం లాంటి అవాస్తవ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలియజేస్తున్నాను.

సదా మీ ప్రేమకు బానిస

సదా మీ ప్రేమకు బానిస

ఇంతటి అవకాశం కల్పించిన స్టార్ టీవీ వారికి, బిగ్ బాస్ వారికి, నా నమస్సుమాంజలి. నటుడుగా మీతో ఎల్లప్పుడూ మీ ప్రేమకి పాత్రుడవ్వాలని ఎప్పుడు కోరుకునే

సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్ణేష్ బాబు

English summary
Sampoo took to Twitter and Facebook to clear all the air about Bigg Boss Show Penalty. He tweeted that the show never fined on him and he also thanked Star MAA and NTR for offering him wonderful opportunity to feature in Bigg Boss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu