»   » సోషల్ మీడియాలో సంపూ హల్‌చల్.. మృత్యువు మనిషి రూపంలో వస్తే నాలా..

సోషల్ మీడియాలో సంపూ హల్‌చల్.. మృత్యువు మనిషి రూపంలో వస్తే నాలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృదయకాలేయం చిత్రంతో ఆకట్టుకొన్న సంపూర్ణేష్‌బాబు అలియాస్ సంపూ మరోసారి వైరస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో రచ్చరచ్చ చేస్తున్నది. ట్రైలర్‌లో భారీ డైలాగ్స్ సంపూ సందడి చేశాడు. తన హావభావాలతోపాటు బుల్లెట్ల మాదిరిగా డైలాగ్స్ వదులుతూ సంచలన రేపుతున్నాడు.

 మృత్యువు నాలా..

మృత్యువు నాలా..

‘మనుషుల్లో భయం ఉంటుంది. దేవుడంటే భయం. దయ్యం అంటే భయం. జీవితంలో ఆడుకోవచ్చు కానీ జీవితంతో ఆడుకున్నావ్. కంచె చేనును మేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను .. అదే మృత్యువు మనిషి రూపంలో వస్తే నాలా ఉంటుందిరా అంటూ కాలితో భూమిని తన్నితే కింద నున్న ఇనుపరాడ్ పైకి లేచి సంపూ చేతిలో వచ్చిపడుతుంది. ఈ టీజర్‌లో కేక పుట్టించిన సంపూ త్వరలోనే అట్టహాసంగా థియేటర్లలో హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.

నో వ్యాక్సిన్.. ఓన్లీ టాక్సిన్..

నో వ్యాక్సిన్.. ఓన్లీ టాక్సిన్..

సంపూర్ణే‌ష్‌బాబు హీరోగా నటిస్తున్న వైరస్ చిత్రాన్ని ఎస్ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ‘నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్' అనేది ట్యాగ్ లైన్. సలీమ్ ఎండి, శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ ద్వయం సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియోను మే 20న విడుదల చేయనున్నారు.

20న ఆడియో..

20న ఆడియో..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సలీమ్ మాట్లాడుతూ.. ‘హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘వైరస్' సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 20న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.

తెరవెనుక ..

ఈ చిత్రానికి మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ మ్యూజిక్‌ను, విజె సినిమాటోగ్రఫీని, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. దుర్గాప్రసాద్ రాయుడు సంభాషణలు అందిస్తున్న చిత్రానికి సలీమ్ ఎం.డి, శ్రీనివాస్ వంగాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఆర్.కృష్ణ కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Burning Star Sampoornesh Babu getting ready with Virus movie. He has gained huge popularity with Hrudaya Kaleyam and Singam 123. The shooting of his upcoming film 'Virus' has been done with and Audio release function slated on May 20th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu