»   » జన్మధన్యం: రజనీకాంత్‌తో సంపూర్ణేష్ బాబు (ఫోటోలు)

జన్మధన్యం: రజనీకాంత్‌తో సంపూర్ణేష్ బాబు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'హృదయ కాలేయం' సినిమాతో పాపులారిటీ పెంచుకున్న అనామక నటుడు సంపూర్ణేష్ బాబు పబ్లిసిటీ పెంచుకోవడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ నెట్వర్కింగులో యాక్టివ్‌గా ఉండే సంపూర్ణేష్ బాబు...ఇటీవల రజనీకాంత్‌ను కలిసిన ఫోటోలు పోస్టు చేసారు.

'లింగా' షూటింగులో భాగంగా రజనీకాంత్ హైదరాబాద్ రావడంతో సంపూర్ణేష్ బాబు వెళ్లి కలిసాడు. రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్‌ను కలిసే అవకాశం నాలాంటి సామాన్య నటుడికి కలగడం గొప్పగా భావిస్తున్నాను. నా జన్మ ధన్యమైంది, నా జీవితంలో సాధించిన గొప్ప విషయం ఇదే అంటూ సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చారు.

సంపూర్ణేష్ బాబు, రజనీకాంత్ ఫోటోలు....అతని తర్వాతి సినిమా వివరాలు స్లైడ్ షోలో...

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు


‘హృదయ కాలేయం' చిత్రం ద్వారా కామెడీ హీరోగా పరిచయమైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట' అనే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు.

ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ

ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ


కొబ్బరి మట్ట చిత్రానికి ‘ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్' అనేది సబ్ టైటిల్. ఈ చిత్రాన్ని కూడా హృదయ కాలేయం నిర్మాత సాయి రాజేష్ నిర్మించబోతున్నారు.

కొబ్బరి మట్ట

కొబ్బరి మట్ట


‘హృదయ కాలేయం' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించడానికి కారణం సంపూర్ణేష్ కామెడీ నటనతో పాటు, సినిమాకు ముందు నుండి ఇంటర్నెట్ ద్వారా కల్పించిన వినూత్న ప్రచారమే. తాజాగా ‘కొబ్బరి మట్ట' చిత్రం విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.

ఏడుగురు హీరోయిన్లా?

ఏడుగురు హీరోయిన్లా?


ఇందులో భాగంగా ఈచిత్రంలో సంపూర్ణేష్ సరసన ఏడుగురు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఇందులో సంపూర్ణేష్ బాబు పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు గెటప్‌ను పోలి ఉండటం గమనార్హం. దీంతో ఈచిత్రం మోహన్ బాబు పెదరాయుడు చిత్రానికి స్పూఫ్‌లా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary

 Sampoornesh babu has met Superstar Rajinikanth on the sets of 'Linga'. He was very much delighted meeting the great superstar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu