»   » ప్రతిష్ఠాత్మక చిత్రంలో సంపూ.. హీరోయిన్‌గా రష్మిక మందన్న

ప్రతిష్ఠాత్మక చిత్రంలో సంపూ.. హీరోయిన్‌గా రష్మిక మందన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృదయకాలేయంతో సెన్సేషనల్ సక్సెస్ అందుకొన్న సంపూర్ణేష్‌బాబు ఆ తర్వాత ఆఫర్ల రేసులో వెనుకపడ్డారు. మధ్యలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసినప్పటికీ అంతగా పేరు రాలేదు. ప్రస్తుతం ఆయన నటించిన కొబ్బరిమట్ట సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. అయితే కొబ్బరిమట్ట రిలీజ్‌కు ముందే సంపూర్ణేష్ బాబుకు మంచి అవకాశం తలుపుతట్టింది.

ప్రస్తుతం నాగార్జున, నాని కాంబినేషన్‌లో దర్శకుడు శ్రీరామ్ అదిత్య రూపొందించే చిత్రంలో ఓ కీలకపాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. పాత్ర పరిధి చిన్నదైనప్పటికీ సంపూకి మంచి పేరు వస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు.

Sampoornesh Babu in Nagarjuna, Nani multi starrer movie

కాగా, ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్, ఛలో ఫేం రష్మిక మందన హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్ పాత్రల్లో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అశ్వినీదత్ నిర్మించే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

English summary
Sampoornesh Babu, the sensation in Telugu film industry who made his debut with Hrudaya Kaleyam is running out of offers presently. Sampoornesh Babu is currently awaiting the release of his film Kobbari Matta which is struggling hard to see the light. Report suggest that the young director Sriram Aditya roped in Sampoornesh Babu for his upcoming film which is a multistarrer starring Akkineni Nagarjuna and Natural Star Nani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X