»   » మోహన్ బాబు అయ్యిపోయాడు...ఈ సారి రజనీకాంత్ తో

మోహన్ బాబు అయ్యిపోయాడు...ఈ సారి రజనీకాంత్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూ ట్యూబ్ లో, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ మధ్య కాలంలో పిచ్చ క్రేజ్ తెచ్చుకుని ఆ మధ్యన రిలీజైన చిత్రం 'హృదయ కాలేయం' . పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వారం తర్వాత చాలా చోట్ల ముందుగా పెద్ద సినిమాల కోసం థియోటర్స్ బుక్ చేసుకోవటంతో తీసేయాల్సివచ్చిందని సమాచారం. దాంతో ఈ చిత్రాన్ని మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని తిరిగి విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి అటువంటి సమస్య రాదని భావిస్తున్నారు. చాలా చోట్ల సంపూర్ణేష్ బాబు అభిమానులు తిరిగి ఆ చిత్రాన్ని ప్రదర్శించమని అడగబట్టే ఈ రీ రిలీజ్ ప్లాన్స్ అని తెలుస్తోంది. అదే రోజున రజనీకాంత్ విక్రమ్ సింహా సైతం విడుదల కాబోతోందని సమాచారం. ఇంతకు ముందు మోహన్ బాబు ...రౌడీ చిత్రం విడుదలరోజు పోటీ పడ్డ ఈచిత్రం ఇప్పుడు రజనీ చిత్రంతో పోటీ పడటం విశేషం.

చిత్రం కథేమిటంటే... సంపూర్ణేష్ బాబు (సంపూర్ణేష్ బాబు) ఓ అనాధ. ఎలక్ట్రీషియన్ పని చేసే అతను ఏ టు జెడ్ అని ఒకసంస్థను స్థాపించి అందరికి సహాయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో నీలవేణి (కావ్య కుమార్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. నీలుపై ప్రేమ పెంచుకుంటాడు. నీలుకు ఈ విషయం చెప్పగా అమె ఓ కండీషన్ పెడుతుంది. నాకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే 100% మగాడు కావాలి, అలాంటి వాడినే పెళ్లాడుతానని చెప్పడంతో తనను తాను నిరూపించుకునే ప్రయత్నం మొదలు పెడతాడు.

Sampoornesh Babu’s Hrudaya Kaleyam movie

ఇందులో భాగంగా సంపూర్నేష్ బాబు ఎలాగయినా రూ. 500 లకే కంప్యూటర్ తయారు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అలా "నీలు సంప్యుటర్" తయారు చేస్తాడు ఆ ఫార్ములా కోసం కొందు చేసిన దాడిలో నీలవేణి గాయపడుతుంది. నీలవేణి హృదయం చెడిపోయింది అని కృత్రిమ గుండె అమర్చాలని డాక్టర్స్ చెప్పగా ఖరీదయిన హృదయానికి బదులు తనే ఒక కృత్రిమ హృదయాన్ని తయారు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో సంపూర్ణేష్ బాబు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? హృదయ కాలేయం అనే టైటిల్‌కి దర్శకుడు న్యాయం చేసాడా? అనేది తెరపై చూడాల్సిందే.

హీరో మాట్లాడుతూ ''ఇది ఏ చిత్రానికీ వ్యంగ్యరూపం కాదు. కుటుంబం మొత్తం చూడదగ్గ ప్రేమకథా చిత్రమిది. దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌ సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. యాక్టర్ కావాలనేది నా కల. కథ వినగానే సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. తొలి పోస్టర్‌తోనే మా సినిమాకు గుర్తింపురావడానికి కారణం రాజమౌళిగారు. ఆయనకు మేం రుణపడి ఉంటాం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉంటే ఎదగొచ్చు'' అన్నారు.

English summary
Sampornesh Babu’s first film ‘Hrudaya Kaleyam’ released last month has done decent business at box office and now makers are re-releasing the picture on May 9th. Curiously, Superstar Rajinikanth’s much awaited flick ‘Kochadaiyaan’ (Vikrama Simha) is also hitting screens on same day.
Please Wait while comments are loading...