»   » బాగుంది: సంపూర్ణేష్ బాబు‘కొబ్బరి మట్ట’ మోషన్ పోస్టర్ (వీడియో)

బాగుంది: సంపూర్ణేష్ బాబు‘కొబ్బరి మట్ట’ మోషన్ పోస్టర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హృదయ కాలేయం, సింగం123 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకున్న సంపూర్ణేష్ బాబు మరో కొత్త సినిమాతో వెండి తెరపై దర్శనమివ్వబోతున్నారు. సంపు నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరి మట్ట' సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది.


'హృదయ కాలేయం' అనే చిత్రమైన టైటిల్‌తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కామెడీ హీరో బర్నింగ్ స్టార్.....మరో విచిత్రమైన టైటిల్‌లో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు 'కొబ్బరి మట్ట'. 'ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్' అనేది సబ్ టైటిల్.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇందులో సంపూర్ణేష్ బాబు పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు గెటప్‌ను పోలి ఉండటం గమనార్హం. దీంతో ఈచిత్రం మోహన్ బాబు పెదరాయుడు చిత్రానికి స్పూఫ్‌లా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Sampoornesh Babu's Kobbari Matta Motion Poster

 
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే 'కొబ్బరి మట్ట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో కనిపించబోతుననాడు. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలు పోషించబోతున్నాడట. తన తొలి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాను ప్రకటించిన సంపూర్ణేష్ బాబు భవితవ్యం ఏమిటో....ఈ రోజు విడుదలైన 'హృదయ కాలేయం' సినిమాను బట్టి తెలుస్తుంది.

ఈ సినిమాకు దర్శకత్వం రూపక్ రొనాల్డ్ రాస్, నిర్మాత ఆది కుంభగిరి, సాయిరాజేశ్ నీలం, కథ, స్క్రీన్‌ప్లే-మాటలు స్టీవెన్ శంకర్.

English summary
Watch Kobbari Matta movie motion poster starring Sampoornesh Babu in triple action. Directed by Rupak Ronaldson, Written by Steven Shankar. Produced by G. Srinivas Rao, Sai Rajesh Neelam & Adi Kumbagiri. Music is composed by Kamran.
Please Wait while comments are loading...