»   » సంపూర్ణేష్ బాబు ‘వైరస్’ ఫస్ట్‌లుక్

సంపూర్ణేష్ బాబు ‘వైరస్’ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మూవీ ''వైరస్'' షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. టైటిల్స్ తోనే తన సినిమా కి హైప్స్ ని క్రియేట్ చేయడం తెలిసిన బర్నింగ్ స్టార్ ఈ సారి కూడా టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేసాడు. వైరస్ మూవీ కి నోవాక్సిక్ ఓన్లీ టాక్సిన్ అనేది ఉపశీర్షిక. పల్లెరేవు రామచంద్రారెడ్డి సమర్పణలో ఎయస్ఎన్ ఫిల్మ్స్ అండ్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఎమ్ డి సలీమ్, శ్రీనివస్ మంగాల నిర్మించిన ఈ మూవీ కి దర్శకుడు యస్.ఆర్ క్రిష్ణ.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... వైరస్ ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అనుకున్న టైం లో కంప్లీట్ చేసేందుకు సహాకరించిన యూనిట్ మెంబర్స్ కి థ్యాంక్స్. అలాగే సంపూర్ణేష్ బాబు తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వైరస్ చిత్రం టెర్రిఫిక్ హార్రర్ కామెడీ తో పాటు మర్డర్ మిస్టరీ తో సాగే కథనం.. ఈ సినిమా యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుందని అన్నారు..

Sampoornesh Babu's Virus First Look Poster

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న వైరస్ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. సంపూర్ణష్ బాబు తనదైనశైలిలో సమాజంలోని విలువలను ప్రశ్నించబోతున్నాడు. ఇప్పటికే హృదయకాలేయం, సింగం 123 సినిమాలతో తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు పొందిన ఈ బర్నింగ్ స్టార్ మరోసారి ఒక డిఫరెంట్ కామెడీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నటీ నటులు: సంపూర్ణేష్ బాబు, గీత్ షా, నిధి షా, వెన్నల కిషోర్, వైవా హర్ష, చమ్మక్ చంద్ర. సాంకేతిక వర్గం: మ్యూజిక్: మీనాక్షి భుజంగ్, బ్యాక్ గ్రైండ్ స్కోర్: సునిల్ క్యాశప్, కొరియోగ్రఫీ: శేఖర్, భాను, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ప్రొడ్యూసర్స్: ఎమ్.డిసలీమ్, శ్రీనివాస్ మంగాల, స్టోరీ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: యస్.ఆర్. కృష్ణ.

English summary
Burning Star Sampoornesh Babu is so close to Telugu audience with movies like Hrudaya Kaleyam and Singam 123. His upcoming film VIRUS shooting is wrapped up and makers are here by releasing the first look. VIRUS has the tag line of No Vaccine, Only Toxin. VIRUS is presented by Pullarevu Ramchandra Reddy on ASN Films and Just Entertainment Creations banner, produced by MD Salim, Srinivas Mangala and directed by SR Krishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu