»   » లొకేషన్ లో స్పృహ తప్పిన సంపూ, షూటింగ్ కాన్సిల్

లొకేషన్ లో స్పృహ తప్పిన సంపూ, షూటింగ్ కాన్సిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎండలు బాగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాలు రెండు ఎండ వేడికి భగ్గుమంటున్నాయి. నలబై నుంచి 45 డిగ్రీల దాకా ఈ వేసవి ప్రతాపం చూపెడుతోంది. ఈ ప్రబావం షూటింగ్ లో ఉన్న హీరో సంపూర్ణేష్ బాబు పై పడింది.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గరలోని నరసాపురంలో ఓ పాట షూటింగ్ లో ఉన్న సంపూర్ణేష్ బాబు..ఊహించని విధంగా వడదెబ్బ ప్రభావంకు లోనయ్యారని సమాచారం. వాంతి చేసుకుని, స్పృహ తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదమేమి లేదు కానీ...యూనిట్ మొత్తం షూటింగ్ కాన్సిల్ చేసుకుని హైదరాబాద్ బయిలుదేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమి లేదు.


'హృదయ కాలేయం' అనే చిత్రమైన టైటిల్‌తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కామెడీ హీరో బర్నింగ్ స్టార్.....మరో విచిత్రమైన టైటిల్‌లో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు 'కొబ్బరి మట్ట'. 'ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్' అనేది సబ్ టైటిల్. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇందులో సంపూర్ణేష్ బాబు పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు గెటప్‌ను పోలి ఉండటం గమనార్హం.


Sampoornesh fainted at Shooting Spot

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే 'కొబ్బరి మట్ట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో కనిపించబోతుననాడు. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలు పోషించబోతున్నాడట.


ఈ సినిమాకు దర్శకత్వం రూపక్ రొనాల్డ్ రాస్, నిర్మాత ఆది కుంభగిరి, సాయిరాజేశ్ నీలం, కథ, స్క్రీన్‌ప్లే-మాటలు స్టీవెన్ శంకర్.

English summary
Sunstroke affected hero Sampoornesh Babu too Narsapur, near Palakollu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu