»   » సంపూర్ణేష్ అరెస్ట్, రాజమౌళి మద్దతు.., విష్ణు పై కేసు.... టాలీవుడ్ లో "హోదా" సెగలు

సంపూర్ణేష్ అరెస్ట్, రాజమౌళి మద్దతు.., విష్ణు పై కేసు.... టాలీవుడ్ లో "హోదా" సెగలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యువత చేపడుతున్న మౌనప్రదర్శనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో రానా సహా పలువురు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. 'హింస కన్నా మౌన ప్రదర్శన మేలు' అనే పోస్టర్‌ను రాజమౌళి, రానా ట్విటర్‌ అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. అలాగే.. యువహీరోలు సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, తనీష్‌, 'బర్నింగ్‌స్టార్‌' సంపూర్ణేష్‌ బాబు కూడా తమ మద్దతు ప్రకటించారు.

ఈ రోజు ఉదయమే విశాఖ చేరుకున్న సంపూర్నేష్ బాబుని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ముందుగా 3టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఆయనని అక్కడే ఉంచితే మరిన్ని ఘర్షణలు తలెత్తవచ్చన్న ఉద్దేశం తో భీమిలి స్టేషన్ కి మార్చి అక్కడే కస్టడీలో ఉంచారు.

SampoorneshBabu arrested in Vizag

ఈ అర్థరాతివరకూ ఆయన అక్కడే ఉండొచ్చని సమాచారం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు దర్షకుడు మహేష్ కత్తి తెలియజేస్తూనే ఉన్నాడు. మొత్తానికి విశాఖ నిరసన ఉధ్యమం లో అరెస్టయిన ఒకే ఒక్క సినీ హీరో "సంపూర్నేష్బాబు" మాతమే. సంపూ బాబు తెలంగాణా ప్రాంతానికి చెందిన వాడు కావటం గమణార్హం.

మరోవైపు..హీరో మంచు విష్ణు దేశాన్ని కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన ఆర్‌.మణిరత్నం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ''జల్లికట్టు పోరాటం స్ఫూర్తిగా ప్రత్యేకహోదా కోసం పోరాడాలి. దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి.

కానీ..మనకు ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావట్లేదు. ఇక అలాంటప్పుడు కలిసి ఉంటే ఏం లాభం? దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలను వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తే బాగుంటుంది' అంటూ దేశ సమగ్రతని భంగపరిచే వ్యాఖ్యలను విష్ణు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

English summary
SampoorneshBabu arrested in Vizag and The actor Manchu vishnu has got himself into a legal trouble with some controversial comments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu