»   »  మగరాయుడుగా భూమిక

మగరాయుడుగా భూమిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhoomika
'అనసూయ' తో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న అందం భూమిక. తన అభినయంతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె తాజాగా 'మల్లె పూవు' లో చేస్తోంది. సముద్ర దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ సినిమాలో ఆమె మగరాయుడు గా దర్శన మిస్తుంది. గతంలో ఈ రకమైన గెటప్ మన టాప్ హీరోయిన్లు (అందరూ దొంగలు లో లక్ష్మి పాత్ర ) చేసి ఉండటంతో క్లిక్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అందులోనూ ఈ మధ్య కాలంలో ఎవరూ ఈ సాహసం చేసిన పాపాన పోలేదు. అంతేగాక సముద్ర దీనికి దర్శకుడు మాత్రమే కాక నిర్మాత కూడా. దాంతో మరింత బాగా సినిమా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఇళయరాజా చాలా కాలం తర్వాత తెలుగులో సంగీతం అందించటం మరో విశేషం. జూలై లో రిలీజుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా భూమికకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశతో ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X